By: ABP Desam | Updated at : 13 Apr 2022 02:19 PM (IST)
వడ్ల పోరులో విజత ఎవరు ? టీఆర్ఎస్ నా ? బీజేపీనా ?
వడ్లను కొంటారా ? లేదా ? తేల్చుకుంటామని యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొంటుందని ప్రకటించారు. చివరి గింజ వరకూ కొంటామన్నారు. మొదటి నుంచి ఆయన కేంద్రం పై ఆరోపణలు చేశారు. కేంద్రం కొనడం లేదన్నారు. కానీ కేంద్రం మొదటి నుంచి ఒకే మాట చెబుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమని దేశమంతా ఒకే ధాన్యం సేకరణ ఉందని చెబుతూ వస్తోంది. కేంద్రం వడ్ల కొనే ప్రసక్తే లేదని తేల్చేయడంతో కేసీఆర్ తామే కొంటామని కేబినెట్ భేటీ పెట్టి ప్రకటించేశారు . దీంతో బీజేపీపై ప్రకటించిన వరి యుద్ధం ముగిసినట్లయింది. మరి ఈ యుద్ధంలో కేసీఆరే విజయం సాధించారా ? బీజేపీని రైతు వ్యతిరేకిగా నిలబెట్టగలిగారా ?
ధాన్యం సేకరణ విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఓ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తెలంగాణ సర్కార్ కూడా బియ్యమే ఇస్తామని చెప్పింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చింది. అయినా వడ్లు కొనాలని కేసీఆర్ ఉద్యమం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావించింది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే తాము ధాన్యం కొంటామని స్పష్టం చేసింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో పాటు అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను బయట పెట్టారు.
వరి వేయవద్దని ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. అధికారులూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి. వారంతా పంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరికీ ఇప్పుడు కేసీఆర్ సర్ది చెప్పాల్సి ఉంది.
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్గా కిరణ్కుమార్ రెడ్డి ! కాంగ్రెస్కు జరిగే మేలెంత ?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !