అన్వేషించండి

Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వాట్ నెక్ట్స్ ? సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో సంచలనాలు ఉంటాయా?

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులో.. అనుమానితులో అందర్నీ ప్రశ్నించారు. ఇప్పుడు సిట్ ఎదుట కీలకమైన సవాళ్లు ఉన్నాయి.

What next in the phone tapping case:  తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్  అధికారులు సుదీర్ఘంగా విచారించడంతో ఈ కేసులో ప్రధాన అంకం ముగిసింది. తర్వాత సిట్ ఏమి చేయబోతోందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ సిట్ కు అసలు సవాల్ ఇప్పుడే ప్రారంభమైందన్న భావన వినిపిస్తోంది. 
 
కేసీఆర్ విచారణలో ఏం చెప్పారు? 

ఆదివారం కేసీఆర్ నివాసంలో సుమారు ఐదు గంటల పాటు సాగిన సిట్ విచారణ ఈ కేసులో కీలక మలుపు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందని, చట్టబద్ధమైన నిఘాకు, అక్రమ ట్యాపింగ్‌కు తేడా ఉందని కేసీఆర్ వాదించినట్లు తెలుస్తోంది. అయితే, సిట్ అధికారులు ఆయన ముందు ఉంచిన  సాంకేతిక ఆధారాలు  ఈ కేసును మరింత  ఆసక్తికరంగా మార్చినట్లుగా చెబుతున్నారు.  ముఖ్యంగా ప్రభాకర్ రావు వంటి అధికారుల పునర్నియామకం ,  రాజకీయ నేతలతో పాటు న్యాయమూర్తులు, వ్యాపారులు..  హరీష్ రావు ఫోన్లు ట్యాప్ చేయడంపై అధికారులు సంధించిన ప్రశ్నలకు  సంధించినట్లుగా చెబుుతున్నారు. 

లోతుగా దర్యాప్తు చేయాల్సిన కేసు 

ఈ కేసు కేవలం రాజకీయ నిఘాకే పరిమితం కాలేదనేది సిట్ అధికారుల ప్రధాన ఆరోపణ. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు పారిశ్రామికవేత్తలను భయపెట్టి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని, ఇందులో ఒక  పోలీస్ మాఫియా  పనిచేసిందని దర్యాప్తులో వెల్లడైంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విరాళాలకు, ఈ ట్యాపింగ్ బెదిరింపులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. రాజకీయ అధికారాన్ని ఉపయోగించి వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా, దాన్ని ధనార్జనకు వాడుకోవడం ఈ కేసులో అత్యంత తీవ్రమైన అంశం. దర్యాప్తు అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్.. ధ్వంసమైన ఆధారాలను పునరుద్ధరించడం. నిందితులు హార్డ్ డిస్క్‌లను మూసీ నదిలో పడేయడం, కీలక డేటాను డిలీట్ చేయడం ద్వారా కుట్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఇప్పటికే గుర్తించారు.  తాజాగా అందిన ఫోరెన్సిక్ నివేదికలు.  క్లౌడ్ డేటా రికవరీ ద్వారా సిట్ కొన్ని కీలక ఫైళ్లను వెలికి తీసినట్లుగా చెబుతున్నారు. ఈ సాంకేతిక ఆధారాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల వాంగ్మూలాలతో సరిపోల్చి పక్కాగా చార్జిషీట్ రూపొందించాలని సిట్ భావిస్తోంది.

 వాంగ్మూలాలు సరిపోవు.. సాక్ష్యాలే ముఖ్యం 

న్యాయస్థానంలో కేవలం నిందితులు లేదా సాక్షుల వాంగ్మూలాలు నిలబడవు. టెలిగ్రాఫ్ చట్టం, టీ చట్టాల ప్రకారం నిబంధనలు ఎలా ఉల్లంఘించారో శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంటుంది. ఎవరి అనుమతితో ట్యాపింగ్ జరిగింది.. అనుమతి లేని నంబర్లను ఎందుకు మానిటర్ చేశారు  అనే ప్రశ్నలకు సిట్ ఇచ్చే సమాధానాలే ఈ కేసు భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.  ఇప్పటికే ఆరుగురు అధికారులపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు, ఇప్పుడు  కుట్ర'  కోణంలో సప్లిమెంటరీ చార్జిషీట్ వేయనున్నారు. ఇందులో కేసీఆర్ పేరును  నిందితుడు గా చేరుస్తారా లేక  సాక్షి గా ఉంచుతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ నేరపూరిత కుట్రలో ఆయన ప్రమేయం ఉందని ఆధారాలు దొరికితే, అరెస్టుల పర్వం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget