అన్వేషించండి

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్‌లో మున్సిపల్ టికెట్ల మంట - సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి - రచ్చ రచ్చే

Jeevan Reddy: జగిత్యాల కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికల చిచ్చు దుమారం రేపుతోంది. తన అనుచరులకు తక్కువ టిక్కెట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Municipal election row is creating chaos in Jagtial Congress:  జగిత్యాల కాంగ్రెస్‌లో మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని మొత్తం 50 సీట్లకు గానూ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు కేటాయించారు.  టికెట్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బండ బూతులు తిడుతూ నిరసన తెలపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. 

తగ్గేదే లేదంటున్న జీవన్ రెడ్డి 

టికెట్ల కేటాయింపుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కాకుండా, మొన్నటికి మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  జగిత్యాలలో కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధాకరం. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలి  తప్ప, పైరవీకారులకు కాదు. నా వర్గీయులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను  అని పరోక్షంగా హెచ్చరించారు. జగిత్యాలలో ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. 

ఎమ్మెల్యే సంజయ్ వర్గం కౌంటర్ 

మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చామని, సర్వే నివేదికల ఆధారంగానే 30 సీట్ల కేటాయింపు జరిగిందని వారు వాదిస్తున్నారు. మున్సిపాలిటీలో పట్టున్న నాయకులను విస్మరించలేదని, అందరినీ కలుపుకుని పోవాలనేదే తమ ఉద్దేశమని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. అయితే, టికెట్లు దక్కని ఆశావహులు మాత్రం సంజయ్ తీరుపై మండిపడుతూ.. పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు.            

సోషల్ మీడియాలో రచ్చ.. హైకమాండ్ సీరియస్                     

ఈ వర్గపోరు సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దీనిపై దృష్టి సారించింది. గ్రూపు రాజకీయాల వల్ల ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పీసీసీ దూతలను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ పంచాయతీ ఎటు దారితీస్తుందోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అనుకుంటూంటే...  జగిత్యాలలో పరిస్థితి వేరుగా ఉంది.         


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget