అన్వేషించండి

AP Politics : ఇంతకీ అంగళ్లులో చంద్రబాబు హత్యాయత్నం చేశారా ? చంద్రబాబుపైనే హత్యయత్నం జరిగిందా ?

అంగళ్లులో చంద్రబాబు పై హత్యయత్నం జరిగిందా ?చంద్రబాబు హత్యాయత్నం చేశారా ?4 రోజుల తర్వాత కేసులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న చంద్రబాబుఎన్ఎస్‌జీ ప్రొటెక్టీపై నివేదికను కేంద్ర హోంశాఖకు పంపుతారా ?

 

AP Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా హత్యలు, హత్యాయత్నాల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రలో భాగంగా చిత్తూరుజిల్లాలో పర్యటించిప్పుడు  పుంగనూరుకు వెళ్తున్న సమయంలో తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే  అంగళ్లు అనే గ్రామంలో  దాడులు జరిగాయి. పుంగనూరు శివార్లలో జరిగింది వేరు. దానిపై ఆ ఘటనలపై ఆరు కేసుల వరకూ  పెట్టారు. అన్నింటిలోనూ పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ పేరును ఏ - వన్‌గా పెట్టారు. అంగళ్లు గ్రామంలో జరిగిన దాడుల విషయంలో మాత్రం చంద్రబాబు పేరును ఏ వన్‌గా చేర్చారు. ఇంకా పలువురు టీడీపీ నేతలను కూడా ఈ కేసులో చేర్చారు. చంద్రబాబుపై ఏకంగా అక్కడ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. 

చంద్రబాబు ఎవరిపై హత్యాయత్నం చేశారు ?

హత్యాయత్నం, కుట్రల కింద కేసులు నమోదు చేయాలంటే కొన్ని ప్రాధమిక సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. హత్యాయత్నం  చేసిన వారు మారణాయుధాలతో దాడి చేసి ఉండాలి. కుట్ర చేసినట్లుగా  స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అయితే అంగళ్లులో జరిగిన దాడుల ఘటనల విషయంలో చంద్రబాబు కనీసం తన వాహనం కూడా దిగినట్లుగా లేదు. అయితే.. తనపై రాళ్లు విసురుతున్న వారిపై మండిపడిన చంద్రబాబు.. వారిని పోలీసులు ఆపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి.. రాళ్లు విసురుతున్న వారిని తరమాలని  సూచించారు. దాంతో టీడీపీ కార్యకర్తలు వారి వెంట పడితే పారిపోయారు. ఈ క్రమంలో చంద్రబాబుపైనే రాళ్ల దాడి జరిగింది. ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్‌జీ కమెండోలో రక్షణ పరికరాలను అడ్డం పెట్టారు. అప్పటికీ వాహనంపై ఉన్న ఓ టీడీపీ నేత తల కూడా పగిలిదింది. 

అంగళ్లులో తనపై హత్యాయత్నం  జరిగిందని వీడియోలు   ప్రదర్శించిన చంద్రబాబు

అంగళ్లలో అసలేం జరిగిందో కొన్ని వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. తనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా తెలియడంతో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు  అక్కడేం జరిగిందో వీడియో ప్రదర్శించారు.  చంద్రబాబు అంగళ్లకు రావడానికి ముందే తెలుగుదేశం పార్టీ జెండా తో వాహనంపై వెళ్తున్న  వారిని దాడి చేసి కొట్టడం,  చంద్రబాబు పుంగనూరు వస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతల వీడియోలను, చంద్రబాబుపై రాళ్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలను నిలువరించకుండా చూస్తున్న పోలీసుల తీరు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు, పోలీసుల లాఠీచార్జ్ వంటి దృశ్యాలను ప్రదర్శించారు. చాలా స్పష్టంగా తనపై హత్యాయత్నం  చేసి..తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని.. ఈ విషయాన్ని సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంగళ్లులో గతంలోనూ టీడీపీ నేతలపై దాడులు 

తంబళ్ల పల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరగడం ఇదే మొదటి కాదు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ నేతలపై పెద్ద స్థాయిలోనే దాడులు జరిగాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సహా పలువురు గాయపడ్డారు. అయితే  ఈ సారి నేరుగా  జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న  చంద్రబాబునాయుడుపైనే రాళ్ల దాడి జరగడం సంచలనం అయింది. ఈ అంశంపై అసలేం జరిగిందో చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ టీమ్ .. తమ శాఖకు రిపోర్ట్ చేస్తుందని అంటున్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మార్కాపురంలోనూ ఇలాగే రాళ్ల దాడి జరిగింది. అప్పుడు ఓ వృద్ధుడు రాళ్ల దాడిలో గాయపడి పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయారు. తర్వాత కృష్ణా జిల్లా నందిగామలోనూ రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలో కరెంట్ కూడా పోయింది.  ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ అధికారికి తల పగిలింది. చంద్రబాబుపై రాళ్ల దాడులు కావాలనే  చేస్తున్నారని.. చంద్రబాబు వయసు దృష్ట్యా రాళ్లు తగిలితే ప్రాణాపాయం ఉంటుందని తెలిసే ఈ పని చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget