అన్వేషించండి

TVK Vijay Risk: దినదినగండం ..నూరేళ్ల ఆయుష్షు -విజయ్ సర్కార్‌కు ఇదే పరిస్థితి - హీరో నెట్టుకురాగలరా?

TVK Vijay: విజయ్ రాజకీయాల్లో ఎవరూ ఎదుర్కోని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అలిగినా ప్రభుత్వం రిస్క్‌లో పడిపోతుంది.

TVK Vijay government: తమిళనాడు రాజకీయాల్లో  విజయ్ తన తమిళగ వెట్రి కళగం ద్వారా కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేశారు. అయితే, ఈ పట్టాభిషేకం పూలబాట కాదు.. ముళ్లబాట . దశాబ్దాల ద్రవిడ రాజకీయాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన, అస్థిరమైన సమీకరణాల మధ్య విజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మేజిక్ ఫిగర్‌ను అతి కష్టమ్మీద చేరుకున్న విజయ్ సర్కార్‌కు  దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు  అన్న సామెత అక్షరాలా సరిపోతుంది.

 సంఖ్యా బలం - కత్తిమీద సాము 

విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉన్న ప్రధాన బలహీనత  సంఖ్యాబలం . మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం ఒకటి లేదా రెండు స్థానాల దూరంలోనే నిలబడటం అంటే, ఐదేళ్ల కాలం పాటు ప్రతి నిమిషం గండం గడిచినట్లే. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ప్రాణవాయువు వంటిది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అలిగినా, లేదా అసంతృప్తితో రాజీనామా చేసినా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి లేదా చిన్న పార్టీ నేత కూడా  కింగ్ మేకర్  పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, వారిని బుజ్జగించడానికే విజయ్ తన శక్తిని ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 మిత్రపక్షాల రిమోట్  రాజకీయం 

విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు,  వీసీకేలు ఇప్పటికీ డీఎంకే కూటమిలో అంతర్భాగమేనన్నది జగమెరిగిన సత్యం. స్టాలిన్ మౌన సమ్మతి తోనే ఈ మద్దతు లభించినట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల విజయ్ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ప్రతి నిర్ణయంలోనూ మిత్రపక్షాల ఆశయాలకంటే, వారిని నడిపిస్తున్న  అదృశ్య హస్తం  వ్యూహాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. తన సొంత రాజకీయ ఎజెండాను అమలు చేయాలనుకున్నప్పుడు మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తే, దానిని ఎదుర్కోవడం విజయ్‌కు అగ్నిపరీక్షే.

 పరిపాలనా దక్షత Vs సినిమా గ్లామర్ 

సినిమాల్లో హీరోగా విలన్లను చిటికెలో మట్టికరిపించడం సులభం, కానీ రాజకీయాల్లో అసలైన విలన్లు వ్యవస్థలోని లొసుగులు ,  ప్రతిపక్షాల వ్యూహాలు. విజయ్‌కు పరిపాలనా అనుభవం శూన్యం. ఒక సుస్థిరమైన బహుమతం లేని ప్రభుత్వంపై ఐఏఎస్ అధికారులు, సీనియర్ రాజకీయ నాయకులు పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో శాఖల కేటాయింపు నుంచి నిధుల విడుదల వరకు ప్రతి అడుగులోనూ మిత్రపక్షాల ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిళ్లను తట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం విజయ్‌కు సాధ్యమేనా అన్నది  అసలు ప్రశ్న.

రాజకీయాలు అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు!

తమిళనాడులో అన్నాడీఎంకే,  డీఎంకే వంటి బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఈ చిన్నపాటి మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవి వెనుకాడవు.   అసంతృప్త ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు శక్తులు నిరంతరం కాచుకుని ఉంటాయి. ఈ వేట నుంచి తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం విజయ్‌కు నిత్యకృత్యంగా మారనుంది. రాజకీయాలు అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, గెలిచిన పీఠాన్ని కాపాడుకోవడం కూడా. విజయ్ ముందున్నది ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఆయన కేవలం ఒక  నటుడు  అనే ముద్రను చెరిపేసి, ఒక  ముదురు రాజకీయవేత్త గా మారాల్సి ఉంటుంది. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ, ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఆయనకు అసాధారణమైన సహనం, వ్యూహాత్మక చతురత అవసరం. విజయ్ ఈ రాజకీయ చదరంగంలో  రాజ గా నిలుస్తారా లేక కేవలం ఒక  పావు గా మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, విజయ్ సర్కార్ ప్రయాణం మాత్రం ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. 

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget