అన్వేషించండి

Vijay Politics: నెంబర్ గేమ్ పాలిటిక్స్‌లో విజయ్ బోల్తా - సేఫ్‌గా ఉండాలంటే అన్నాడీఎంకేతో పొత్తే బెటర్ - ఏం చేయబోతున్నారు?

Tamilnadu TVK: విజయ్ పవర్ పాలిటిక్స్ కు కొత్త. పూర్తి మెజార్టీ రాకపోవడం అనే క్లిష్ట పరిస్థితి వచ్చింది. చిన్న పార్టీల మద్దతు తీసుకున్నా.. రోజూ టెన్షన్ తోనే పాలన చేయాల్సి ఉంటుంది.

Vijay fail in number game politics:   టీవీకే విజయ్ పవర్ పాలిటిక్స్ కు కొత్త. ఆరంభంలోనే ఆయనకు ప్రజల తీర్పు వచ్చినా..  పూర్తి మెజార్టీ రాకపోవడం అనే క్లిష్ట పరిస్థితి వచ్చింది. తాను సింగల్ అని చెప్పుకుని సీట్లు తెచ్చుకున్న తర్వాత పది సీట్ల కోసం చిన్నా, చితకా పార్టీలను బతిమాలుకోవడం ఆయనకు ఇబ్బందికరమే.. ఒక వేళ వారు మద్దతిచ్చినా తాత్కాలికంగా గట్టెక్కగలరు. ఆరు నెలల్లో మళ్లీ సమస్యలు వస్తాయి. ఆయన గ్రాఫ్ పడిపోయిందని అనుకున్న మరుక్షణం.. ఆ చిన్నా చితకా పార్టీలన్నీ మళ్లీ డీఎంకే వద్దకు చేరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వారు డీఎంకే కూటమిలో ఉన్నారు. డీఎంకే సూచనలతోనే విజయ్ కూటమిలోకి వస్తున్నారు. అందుకే విజయ్ ఇలాంటి పొత్తులను .. నెంబర్స్ ను నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనేక సమస్యలు  వస్తాయి. అందుకే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. డీఎంకేతో కలిసి వెళ్లడమే విజయ్‌కు అత్యంత సురక్షితం. 
 
 విజయ్ ముందున్న రాజ్యాంగ సవాల్! 

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితికి ప్రధాన కారణం నెంబర్స్. విజయ్ తన పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 సీట్లు సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం. కేవలం పది సీట్ల కోసం చిన్నా చితకా పార్టీలను, స్వతంత్రులను ఆశ్రయించడం విజయ్ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమం.  ఈ పార్టీలు ఏ క్షణమైనా తమ మద్దతును ఉపసంహరించుకునే ప్రమాదం ఉండటంతో, విజయ్ ప్రభుత్వం ఒక  వేలాడే కత్తి  కింద ఉన్నట్లే.   ప్రస్తుతం విజయ్ కూటమిలోకి రావాలని భావిస్తున్న కొన్ని చిన్న పార్టీలు అధికారికంగా డీఎంకే కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాలిన్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటూనే, విజయ్‌కు మద్దతు పలకడం వెనుక డీఎంకే వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఈ పార్టీల ద్వారా రిమోట్ కంట్రోల్ డీఎంకే చేతిలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ గ్రాఫ్ తగ్గుతోందని భావిస్తే, ఈ పార్టీలన్నీ మళ్లీ డీఎంకే గూటికి చేరిపోవడం ఖాయం. ఇది విజయ్‌ను రాజకీయంగా మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది.

 సుస్థిరత కోసమే అన్నా ఎంకేతో దోస్తీ? 

విజయ్ రాజకీయాల్లో తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుతానికి  అన్నాడీఎంకేతో కలిసి వెళ్లడమే అత్యంత సురక్షితమైన మార్గం. అన్నాడీఎంకే వంటి బలమైన యంత్రాంగం ఉన్న పార్టీ మద్దతు ఉంటేనే విజయ్ తన ఐదేళ్ల పాలనను ప్రశాంతంగా పూర్తి చేయగలరు. చిన్న పార్టీలపై ఆధారపడితే ప్రతి ఆరు నెలలకోసారి రిసార్ట్ రాజకీయాలు , విశ్వాస తీర్మానాలు' వంటి ఇబ్బందులు తప్పవు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు ఇలాంటి అస్థిరమైన పరిస్థితులు ఆయన భవిష్యత్తుకు చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  తాను సింగిల్ గానే వస్తానని, మార్పు తెస్తానని విజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అన్నా డీఎంకే వంటి పార్టీలతో రాజీ పడటం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందనే భయం ఆయనలో ఉంది. అయితే, పాలిటిక్స్ లో ప్రతిష్ట కంటే  ప్రాక్టికాలిటీ  ముఖ్యమని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మెజార్టీ లేని స్థితిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే, బలమైన కూటమిని నిర్మించుకోవడం విజయ్‌కు శ్రేయస్కరం. అలా కాకుండా పది సీట్ల కోసం వెంపర్లాడితే, చివరికి ఆ ఆరుగురు ఎమ్మెల్యేల డైరక్షన్ లో పాలన చేయాల్సి వస్తుంది. 

 విజయ్ తేల్చుకోవాల్సిన సమయం 

  తమిళనాడు రాజకీయాలు ఒక సంధి కాలంలో ఉన్నాయి. విజయ్ ఇతర చిన్న పార్టీలను నమ్ముకుని అస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తారా? లేక అన్నాడీఎంకేతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుని  సుస్థిరమైన  పాలన అందిస్తారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అన్నాడీఎంకేతో దోస్తీ విజయ్ రాజకీయ ఆశయాలకు విరుద్ధం కావొచ్చు కానీ, ప్రస్తుత సంఖ్యా బలం ప్రకారం అదే ఆయనకు రాజకీయ కవచం అనేది ఎక్కువ మంది అభిప్రాయం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy: మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget