అన్వేషించండి

TVK Vijay Swearing in Ceremony: విజయ్‌ని గట్టెక్కించేది ఎవరు? ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం! TVK లో టెన్షన్ టెన్షన్

టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నానని అనడం సరికాదని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు గవర్నర్ తెలిపారు.

TVK Chief VIjay | చెన్నై: తమిళనాడు మినహా ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజారిటీ రాకపోవడంతో తమిళనాడు రాజకీయాలు సినిమా సస్పెన్స్‌ను తలపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే విజయ్‌ని సీఎంగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటున్నారని టీవీకే పార్టీ నుంచి, విజయ్ మద్దతుదారుల నుంచి వినిపిస్తోంది. అయితే 118 ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra Arlekar) స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్
నటుడు, టీవీకే అధినేత విజయ్ గురువారం రెండోసారి తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌తో సమావేశమయ్యారు. తన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ అని పేర్కొంటూ, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని విజయ్ కోరారు. కాంగ్రెస్ మద్దతును ప్రస్తావిస్తూ, తమతో 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విజయ్ తెలపగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే మెజారిటీకి సంబంధించిన పూర్తి జాబితాను సమర్పించాలని గవర్నర్ సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేదని గవర్నర్ విజయ్‌కి స్పష్టం చేశారు. అందుకే, మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన మద్దతును కూటగట్టాక తన వద్దకు రావాలని విజయ్‌కి సూచించారు. అసలే రాజకీయాలకు కొత్త అయిన విజయ్ ఈ ఊహించని పరిణామాలకు షాక్ అవుతున్నారు.

తమిళనాడులో పెరిగిన రాజకీయ అలజడి
గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వైఖరితో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు డీఎంకే (DMK) శాసనసభా పక్ష సమావేశం జరగగా, మరోవైపు పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్‌లో ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలు సైతం సమావేశయ్యారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వచ్చి విజయ్‌కి ఇస్తారని ప్రచారం జరగడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

డీఎంకే, అన్నాడీఎంకే కలిసి వస్తాయా?
తమిళనాడు ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పు ఇచ్చారని, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎం.కె. స్టాలిన్‌కు నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యేల భేటీ తరువాత డీఎంకే పేర్కొంది. డీఎంకే నేతల ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వాదాన్ని తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న DMK,AIADMK అధికారం కోసం ఏదైనా వ్యూహాత్మక ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నాయా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. మరోవైపు, రిసార్ట్‌లో జరిగిన సమావేశం తర్వాత AIADMK పార్టీ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కోరారు. త్వరలోనే మంచి వార్త వింటారని ఆయన ఎమ్మెల్యేలతో చెప్పినట్లు సమాచారం. 

TVK ఎమ్మెల్యేల్లో పెరిగిన ఆందోళన
గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వైపు నుంచి జరుగుతున్న ఆలస్యం, ద్రావిడ పార్టీలు ఏం చేస్తాయోనని.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటాయా అని TVK శిబిరంలో ఆందోళన పెరుగుతోంది. ఒకవేళ DMK, AIADMK తమ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే కనుక టీవీకే ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ ?
తమిళనాడులో ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ తగ్గలేదు. పరిస్థితులు అనుకూలిస్తే మే 7న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ ఇంఛార్జ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఇచ్చిన ట్విస్టుతో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమవుతోంది. మరోవైపు టీవీకే, అన్నాడీఎంకే పార్టీలు ఏం చేయబోతున్నాయని విజయ్ పార్టీలో ఆందోళన పెరుగుతోంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మరికొన్ని పార్టీలను విజయ్ సపోర్ట్ కోరగా.. అభిప్రాయాన్ని ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు గవన్నర్ ఆహ్వానించకపోవడం టీవీకే శిబిరంలో టెన్షన్ పెంచుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Rohini Sindhuri Vs D Roopa: ఐఏఎస్ రోహిణి - ఐపీఎస్ రూపాల కేసుల పోరాటంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - ఇదే వారికి ఫైనల్ చాన్స్ !
ఐఏఎస్ రోహిణి - ఐపీఎస్ రూపాల కేసుల పోరాటంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - ఇదే వారికి ఫైనల్ చాన్స్ !
Strait of Hormuz opens after Iran war: యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
Real life cinematic love story: ఈగోపై ఏనాటికైనా ప్రేమదే విజయం - ఢిల్లీ హైకోర్టులో విడాకుల కేసు క్లైమాక్స్ తెలిస్తే మర్చిపోలేరు!
ఈగోపై ఏనాటికైనా ప్రేమదే విజయం - ఢిల్లీ హైకోర్టులో విడాకుల కేసు క్లైమాక్స్ తెలిస్తే మర్చిపోలేరు!
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
E20 Vs E85 ఫ్యూయల్ - ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ టెస్ట్‌లో తేలిన నిజం
E85 పెట్రోల్ నిజంగా చౌకేనా? మైలేజ్ టెస్ట్‌లో షాకింగ్ ఫలితాలు!
Hyderabad News : సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని అసభ్య ప్రవర్తన - వ్యకిపై సినీ నటి కంప్లైంట్
సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని అసభ్య ప్రవర్తన - వ్యకిపై సినీ నటి కంప్లైంట్
Nivetha Pethuraj : ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్
ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్
Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
Embed widget