Tamilnadu Vijay: విజయ్ ఇంటి ముందు అభిమానుల వింత ప్రవర్తన - ఈ వీడియోలు చూస్తే...
Tvk Vijay: తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠగా సాగుతూంటే.. ఆయన ఇంటి వద్ద ఫ్యాన్స్ మాత్రం వింత వింత ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Strange behavior of Vijay fans: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నివాసం వద్ద అభిమానుల హడావుడి పెరిగింది. అలా వస్తున్న అభిమానుల ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నీలాంగరైలో విజయ్ నివాసం వద్ద వింత దృశ్యాలు!
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం సృష్టించిన వేళ, చెన్నై నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద అభిమానుల కోలాహలం ఒక్కసారిగా మిన్నంటింది. తమ అభిమాన హీరోను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశ నెరవేరుతున్న తరుణంలో, అభిమానులు కొందరు భావోద్వేగంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్ల మీద సాష్టాంగ నమస్కారాలు చేయడం, హారతులు పట్టడం, కొందరు అభిమానులు తమ రక్తంతో విజయ్ చిత్రపటానికి తిలకం దిద్దడం వంటి దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.
கஞ்சா போதைய விட பேராபத்து இந்த போதை .
— Shibin (@Shibin_twitz) May 8, 2026
இவர்களுக்கு ஓட்டு போட்ட படித்த பண்புள்ளவர்கள் இதை பார்த்து பெருமை கொள்ளுங்கள் . pic.twitter.com/odTrmqMQVK
విజయ్ ఇంటి వద్ద ట్రాఫిక్ రద్దీ
విజయ్ ఇంటి బయట గంటల తరబడి పడిగాపులు కాస్తున్న అభిమానుల వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. కొందరు అభిమానులు ఇంటి ప్రహరీ గోడలు ఎక్కేందుకు ప్రయత్నించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విజయ్ ఇంటి గుమ్మం ముందున్న మట్టిని పవిత్రంగా భావించి బాటిళ్లలో నింపుకోవడం, అక్కడ ఉన్న చెట్లకు పూజలు చేయడం వంటి వింత చర్యలు స్థానికులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
"எவ்வளவு கஷ்டம் வந்தாலும் என் தலைவர் முதலமைச்சர் ஆகனும்.. சாமி நீ தான் காப்பாதனும்.."
— Polimer News (@polimernews) May 7, 2026
விஜய் வீட்டு வாசலில் கதறி அழுத த.வெ.க தொண்டர்#Chennai | #Neelankarai | #TVK | #TVKVijay | #Politics | #PolimerNews pic.twitter.com/Q3tdAJx7uD
విజయ్ స్తోత్రాలు పాడుతున్న ఫ్యాన్స్
మరోవైపు, వృద్ధులు, మహిళా అభిమానులు సైతం విజయ్‌ను ఒక్కసారి చూడాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మా దేవుడు ముఖ్యమంత్రి అయ్యాడు అంటూ కొందరు విలపిస్తుండగా, మరికొందరు మైకు పట్టుకుని విజయ్ పొగడ్తలతో పాటలు పాడుతున్నారు.
”நான் தான் விஜய்.. கூட்டணி பேச தான் நான் வந்திருக்கேன்”... தவெக தலைவர் விஜய் வீட்டு வாசலில் புது பைக்கில் வந்த நபர் செய்த செயல்..!#Neelankarai | #TVK | #TVKVijay | #PolimerNews pic.twitter.com/Mlb3cziRvt
— Polimer News (@polimernews) May 8, 2026
భారీగా పోలీస్ బందోబస్త్
ప్రస్తుతం విజయ్ నివాసం వద్ద పోలీసు బందోబస్తును భారీగా పెంచారు. అభిమానులు శాంతియుతంగా ఉండాలని, ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని టీవీకే పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల విజయం తెచ్చిన ఉత్సాహం అభిమానుల్లో కట్టలు తెంచుకున్నప్పటికీ, అది ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
தவெக தலைவர் இல்லம் முன்பு குவிந்த தொண்டர்கள் மற்றும் ரசிகர்கள்... பலத்த பாதுகாப்பு திரும்ப பெறப்பட்ட நிலையில் வீட்டின் முன்பு ஏராளமான ரசிகர்கள் வந்து புகைப்படம் எடுத்து மகிழ்ந்து வருகின்றனர்#Neelankarai #Vijaytvk #Vijayhouse #Fans #Crowd #Newstamil24x7 pic.twitter.com/F6JIgrSyIQ
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) May 7, 2026
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు





















