TRS Support Yaswant Sinha : యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు - కేసీఆర్ కీలక నిర్ణయం!
యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని టీార్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏ క్షణమైనా అధికారిక ప్రకటన చేయనున్నారు.
TRS Support Yaswant Sinha : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. ఉదయమే విపక్ష పార్టీ నేతలందరూ సమావేశమై యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటేయాల్సిందిగా కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పలువురు పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. వారందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్ ఇంజిన్ అభివృద్ధి తెలంగాణలో - మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ , బీజేపీలకు సమాన దూరం పాటించాలని కేసీఆర్ ఓ విధానంగా పెట్టుకున్నారు. యశ్వంత్ సిన్హా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో బీజేపీ నేత అయినప్పటికీ .. ఆ పార్టీ మోదీ, షాల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన దూరమయ్యారు. మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన తృణమూల్‌కు రాజీనామా చేశారు. మేధావిగా పేరున్న యశ్వంత్ సిన్హాకు ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
వెంకయ్య నాయుడు లేదా అనసూయ ఊకే ! ఈ ఇద్దరిలో ఒకరే రాష్ట్రపతి !
బీజేపీ కూటమి అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం కాబట్టి ఆ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ యశ్వంత్ సిన్హా అభ్యర్థి అయితే బీహార్‌కు చెందిన జేడీయూ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జేడీయూ ఎన్డీఏ పార్టీ. అయితే సిన్హా బీహార్‌కు చెందిన వ్యక్తి. బీహార్ వ్యక్తి రాష్ట్రపతి అయితే మద్దతిస్తామని జేడీయూ చెబుతూ ఉంటుంది. అదే జరిగితే బీజేపీ బలం కాస్త తగ్గుతుంది.
రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి
వెంకయ్యనాయుడును అభ్యర్థిగా నిలబెట్టినా కేసీఆర్ యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వెంకయ్య తెలుగు వ్యక్తి అయినప్పటికీ బీజేపీని ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున మద్దతివ్వడం రాజకీయంగా కూడా మంచిది కాదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.