News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Who Is BJP President Candidate: వెంకయ్య నాయుడు లేదా అనసూయ ఊకే ! ఈ ఇద్దరిలో ఒకరే రాష్ట్రపతి !

రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున రాష్ట్రపతి రేసులో చివరికి వెంకయ్యనాయుడు, అనసూయ ఊకే పేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ తర్వాత అధికారికంగా ఒకరి పేరును ప్రకటించనున్నారు.

FOLLOW US: 
Share:

Who Is BJP President Candidate:  భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ తర్వాత అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ వర్గాల్లో ప్రధానంగా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఒకటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కాదా.. మరొకరు చత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయ ఊకే పేరు. ఇద్దరిలో ఒకరిని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు! నడ్డా, అమిత్ షా భేటీ అందుకేనా!

వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ లభిస్తుందా?

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు  బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆపారమైన గౌరవం ఉంది. అదే ఆయనను బీజేపీ అధ్యక్షుడి లాంటి కీలక పదవులు అందేలా చేసింది. దేశంలో అత్యంత ప్రముఖమైన నేతగా వెంకయ్యనాయుడు ఎదిగారు. ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లారు. ఇప్పుడు దేశ అత్యున్నత పదవి వరకూ చేరుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి పదవిని దక్షిణాదికి  కేటాయించాలన్న ఓ డిమాండ్ కొంత కాలం నుంచి వినిపిస్తోంది. ప్రధాని లాంటి పదవి ఉత్తరాదికే దక్కుతోంది. ఈ కారణంగా దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలన్న అభిప్రాయం పెరుగుతోంది. బీజేపీ అగ్రనేతలు వెంకయ్యనాయుడుతో సమావేశం కావడం కూడా ఆయన అభ్యర్థిత్వం ఖాయం కావొచ్చన్న ప్రచారం జరగడానికి కారణం అని భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల బరిలో భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా- పక్కాగా దీదీ వ్యూహం!

ప్రచారంలో చత్తీస్ ఘడ్ గవర్నర్ పేరు ! 

మరో వైపు చత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికే పేరు కూడా విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆమె  మధ్యప్రదేశ్‌కు చెందిన ఎస్టీ వర్గానికి చెందిన నేత. ఈ సారి ఎస్టీలకు రాష్ట్రపతి పదవి కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నారని అందుకే ఆమె పేరు పరిగణనలోకి తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే అనసూయ ఉయికే వెంకయ్యనాయుడి మాదిరి మొదటి నుంచి బీజేపీ భావజాలం ఉన్న నేత కాదు. కాంగ్రెస్ పార్టీ తరపున మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. అర్జున్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. ఆ తర్వాత  బీజేపీలో చేరారు. 
 
మోదీ , షా మనసుల్లో ఇంకెవరైనా ఉన్నారా ? 

రాష్ట్రపతి అభ్యర్థిని ఏ క్షణమైనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించబోతోంది. అయితే పార్లమెంటరీ బోర్డు ఆమోదం లాంచనప్రాయమే..అసలు నిర్ణయాలు మాత్రం మోడీ, షా చేతుల్లోనే ఉంటాయి. వారు ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారెవరన్నది స్పష్టత లేదు.   మొత్తంగా రాష్ట్రపతి రేసులో చివరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు కాగా మరొకరు అనసూయ ఉయికే.  వీరు కాకుండా ఇంకెవరి పేరునైనా అనూహ్యంగా తెరపైకి తెస్తారేమో వేచి చూడాలి. 

Published at : 21 Jun 2022 03:05 PM (IST) Tags: venkaiah naidu NDA Presidential Candidate BJP presidential candidate Anasuya Uyike

ఇవి కూడా చూడండి

Indian Navy: ఇండియన్ నేవీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ నియామకం

Indian Navy: ఇండియన్ నేవీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ నియామకం

Mizoram Assembly Polls: ఎన్నికల కౌంటింగ్ వాయిదా! అసలు కారణం తెలుసా?

Mizoram Assembly Polls: ఎన్నికల కౌంటింగ్ వాయిదా! అసలు కారణం తెలుసా?

ఇండియాలో మొదటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్‌ ఫైవ్‌ ఇవే

ఇండియాలో మొదటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఎప్పుడు చేశారు?  ఫస్ట్‌ ఫైవ్‌ ఇవే

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో  నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

టాప్ స్టోరీస్

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు -  ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా? 

Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా? 

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!