Telangana TDP : తెలంగాణలో టీడీపీకి అంత ఈజీ కాదు - చంద్రబాబుకీ స్పష్టత ఉందా ?
TDP : తెలంగాణ టీడీపీలో చేరుతున్నామని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. ఇది ఓ రకంగా షాకే . కానీ దీని వల్ల టీడీపీ పుంజుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు.
Telangana TDP Revival is not so easy : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వ్యతిరేకంాగ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది జరిగి ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి వరకూ తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడ్ని నియమించలేకపోయారు. కానీ ఏపీలో టీడీపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ పార్టీ బలోపేతం చేస్తామని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు చంద్రబాబు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. కనీసం పార్టీ అధ్యక్షుడ్ని నియమించడం లేదు.
టీడీపీలో ఎవరు చేరినా నో హోప్స్
తెలంగాణ టీడీపీలో చేరుతున్నానని ఇంకా చాలా మంది వస్తారని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. తీగలతో పాటు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లిన సందర్భంలో రాజకీయాలు మాట్లాడలేదు. కానీ తీగల మాత్రం తాను టీడీపీలో చేరుతానని చెప్పానన్నారు. తర్వాత మాట్లాడ మాట్లాడదామని చంద్రబాబు చెప్పారని తీగల చెప్పారు. అంటే చంద్రబాబు కూడా చేరికల విషయంలో అంతగా దృష్టి పెట్టడానికి సిద్ధంగా లేరని అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీని తెలంగాణలో కనీసం కొన్ని స్థానాల్లో అయినా రేసులోకి తీసుకు రావాలంటే. నేతలతో అవదు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు.
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
తెలంగాణ రాజకీయాల్లో మరో పార్టీ కి స్పేస్ లేదు !
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితుల్లో మరో పార్టీ చోటు సంపాదించాలంటే చాలా కష్టం. ఎందుకంటే రాజకీయ శూన్యత ఇప్పుడు తెలంగాణలో లేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. మరో పార్టీ ఈ మూడు పార్టీలను కాదని ఓట్లు,సీట్లు దక్కించుకోవాలంటే.. వాటికి మించిన ఆకర్షణ ఉండాలి. ప్రస్తుతానికి టీడీపీలో అది లేదు. తీగల కృష్ణారెడ్డి లేదా మల్లారెడ్డి వంటి వారి వల్ల అది రాదు. ముఖ్యంగా ఇతర పార్టీలకు తరలిపోయిన ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చకోవాలి. అంటే వరే పార్టీ బలహీనం కావాలి. అలా అయినా ఆ ఓటు బ్యాంక్ అంతా మళ్లీ టీడీపీకి వచ్చేలా చేసుకోవడం పెద్ద టాస్క్. బలమైన నాయకుడు ఉంటే సాధ్యమవుతుంది. లేకపోతే ప్రత్యామ్నాయ పార్టీ వైపు వెళ్లిపోతుంది. అలాంటి బలమైన నాయకుడు ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో కనుచూపు మేరలో కనిపించడం లేదు.
చంద్రబాబుకూ తెలుసు.. అందుకే వెయిట్ అండ్ సీ పాలసీ !
తెలంగాణలో పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలంటే ఎంత కష్టమో చంద్రబాబుకూ తెలుసని అందుకే వెయిట్ అండ్ సీ పాలనీని పాటిస్తున్నారని అనుకోవచ్చు. పార్టీ పగ్గాలు ఎవరికీ అప్పగించకుండా ఇనాక్టివ్ గా ఉంచడానికి కూడా ప్రత్యేకమైన వ్యూహం ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నందున వీలైనంత వరకూ ఆ పార్టీతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటందని అందుకే.. పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు కూడా సిద్ధంగా లేరని అంటున్నారు. అయితే చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేసే రకం కాదని.. లసరైన టైమింగ్ కోసం చూస్తున్నారని ఎక్కువ మంది తెలంగాణ టీడీపీ నేతలు నమ్ముతున్నారు