అన్వేషించండి

AP Kapu Politics : కాపు నేతల వరుస భేటీలు కొత్త పార్టీ కోసమా ? ఐక్యత కోసమా ? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?

ఏపీ కాపు సామాజికవర్గ నేతలు వరుసగా భేటీ అవుతూండటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. వారు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ?

AP Kapu Politics : ఆంధ్రప్రదేశ్‌లో కాపు రాజకీయ నేతలు ఇటీవలి కాలంలో పార్టీలకు అతీతంగా సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మాత్రం ఇలా విడి సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆ పార్టీ కాపు నేతలు భేటీలు అవుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా విశాఖలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగా ఇప్పుడు ఏం జరిగినా రాజకీయం ఉంటుంది.. రాజకీయం లేదంటే.. అబద్దం చెప్పినట్లే. అందుకే కాపు నాయకులు ఇప్పుడు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నది కీలకంగా మారింది. 

ఐక్యత కోసం కాపు నేతల ప్రయత్నాలు !

అన్ని పార్టీల్లోనూ కాపు సామాజికవర్గ నేతలు కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లలేదు కానీ ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి.. బలాన్ని కాపు నేతలు పొందారు. గత ప్రభుత్వంలో..ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే వారికి ఎంత పవర్ ఉందనే విషయం పక్కన పెడితే.. వారిని రాజకీయంగా ప్రాధాన్యపరంగా పార్టీలు గుర్తిస్తున్నాయి. అయితే వారికి సీఎం పదవి అనేది ఇంకా అందడం లేదు. ఆ అసంతృప్తి ఉంది. ఇటీవలి కాలంలో కాపు నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య నిర్వహించిన రెండు సమావేశాలతో కాపు నేతలంతా కలిసి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకూ అది సాకారం కాలేదు. తాజాగా మరోసారి భేటీలు అవుతున్నారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వీరంతా మరోసారి భేటీ కానున్నారు. 

అన్ని పార్టీల్లోని కాపు నేతల ఐక్యతారాగం - వైఎస్ఆర్‌సీపీ నేతలది వేరు దారి !

అన్ని పార్టీల్లోని కాపు నేతలు.. సమావేశమవుతున్నారు. వారికి పార్టీల అడ్డంకులు రావడం లేదు. తమ పార్టీకి ఇబ్బంది లేకుండా.. కుల సంఘ సమావేశాలు.. నేతల భేటీల్లో పాల్గొంటున్నారు. అది సామాజికవర్గ సమావేశమే కానీ.. రాజకీయం కాదని సర్ది చెప్పుకుంటున్నారు. ఈ సమావేశాల పట్ల వారు ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు. పార్టీకి వారు నిబద్ధులై ఉంటారని నమ్మకంతో ఉన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మాత్రం..ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఆ పార్టీ కాపు నేతలంతా భేటీ అవుతూంటారు. అయితే ఈ సమావేశాలు ప్రధానంగా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వడానికే పెడుతున్నారు. అందుకే.. వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలపై ఆ సామాజికవర్గంలోనే విమర్శలు వస్తూ ఉంటాయి. 

సొంత పార్టీ వైపు దృష్టి సారిస్తారా ? పవన్‌కు  మద్దతుగా నిలుస్తారా ?

కాపు నేతలంతా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన కూడా గతంలో చేశారన్న ప్రచారం జరిగింది. కానీ కాపులు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరూ గెలవరు. అందుకే విరమించుకుని ఉంటారు.కానీ ఆ సామాజికవర్గం నుంచి  పవన్ కల్యాణ్ ..  మాస్ లీడర్‌గా రాజకీయ బరిలో ఉన్నారు. అందరూ కలిసి ఆయనను సమర్థిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వారికి వచ్చి ఉండవచ్చు. కానీ అది అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. పవన్ కల్యాణ్ కూడా ఒక్క కాపులు ఓటు వేస్తేనే తాను సీఎం కాలేనని తెలుసు.  అందరి మద్దతూ ఆయన కోరుకుంటారు. అదే సమయంలో కాపు నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాదనుకుని.. పవన్ కు మద్దతు తెలుపడం కూడా కష్టమే. 

ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమే !

కాపు నేతలు సమావేశమైనా.. ఓ పార్టీకి ఏకపక్షంగా మద్దతు పలకడం కష్టం. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ కాపు నేతలు ఉన్నారు. వారికి ప్రాధాన్యం లభిస్తోంది. అందరూ బయటకు వచ్చి తమ సామాజికవర్గానికే మద్దతు ఇవ్వాలని అడగలేరు. కాపులు కూడా ఒకే కులం కాదు.. కాపు, తెలగ, ఒంటరి, బలిజ రకాలుగా ఉన్నాయి. అందులోనూ రాజకీయం చిచ్చు పెడుతుంది. అందుకే... కాపు నేతలు సమావేశాలు..తమ వర్గానికి మెరుగైన అవకాశాల పొందేలా చేయడం.. అవకాశం వచ్చినప్పుడు సీఎం పీఠాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలనే కోణంలోనే జరిగే అవకాశం ఉందనేది ఎక్కువ మంది చెప్పేమాట. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget