Anantapur Politics : హిందూపురం వేడికి ధర్మవరం సెగ.. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఉక్కపోత !

జిల్లాల విభజన, రెవిన్యూ డివిజన్ తరలింపు అంశాలు అనంతపురం వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ధర్మవరం రెవిన్యూ డివిజన్ కోసం పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు కారణం అయింది.

FOLLOW US: 

అనంతపురం జిల్లా  ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు రాజకీయ ఉద్యమాలకు కారణం అవుతోంది. రెవిన్యూ డివిజన్‌ను పునరుద్ధరించాలంటూ టీడీసీ నియోజకరవగ్ ఇంచార్జ్  పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల విభజన కారణంగా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓ వైపు హిందపురం జిల్లా కోసం ఉద్యమాలు జరుగుతూండగా.. ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ను రద్దు చేయడంపై  పరిటాల శ్రీరాం ఆందోళనలు చేస్తున్నారు.

మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి కూడా అనంతపురంలో కలెక్టర్ ను కలిసి ధర్మవరంలోనే రెవిన్యూ డివిజన్ కేంద్రం వుండేలా చూడాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే ధర్మవరంలో మూడు ముక్కలాటగా మారిన రాజకీయాలు తాజా సంఘటనతో కూడా అదే వైఖరి కంటిన్యూ అవూతూ వస్తోంది. ఓ వైపు ధర్మవరంలో పరిటాల శ్రీరాం మౌనదీక్ష చేస్తూం మరోవైపు అనంతపురంలో కలెక్టర్ ను కలిసి ఈ సమస్యపై తామంటే తాము పోరాటం చేస్తున్నామన్న సంకేతాలను ఇతర పార్టీల నేతలు ప్రజల్లోకి పంపిస్తున్నారు.  

టీడీపీ ఇంచార్జ్‌గా పరిటాల శ్రీరామ్, బీజేపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతలకు ఉన్నంత వెసులుబాటు ఎమ్మెల్యే కేతిరెడ్డికి లేదు. ఆయన ధర్నాలు, ఆందోళనలు చేయలేరు. అందుకే కలెక్టర్ ద్వారా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఖచ్చితంగా రెవిన్యూ డివిజన్ తరలి పోకుండా చూడాలని ప్రజలు కూడా ఆశిస్తున్నారు.  మరో వైపు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. నూతనంగా ఏర్పాటు అవుతున్న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కచ్చితంగా రెవిన్యూ డివిజన్ కేంద్రం వుండాలి కాబట్టి ధర్మవరం నుంచి మార్చాల్సి వస్తందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. .ఇప్పటికే అదికారులకు ఆదేశాలు కూడా అందాయి. 

నూతన జిల్లా కేంద్రం విషయంలో .. ధర్మవరం రెవిన్యూ డివిజన్ కేంద్రం విషయంలో రాజకీయ లబ్ది కోసమే ఇతరులు ఆందోళనలు చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేతలకు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్  సూచించినట్లుగా తెలుస్తోంది.రాజకీయంగా తిప్పికొట్టేందుకు స్థానికంగా కార్యక్రమాలు చేసుకోండి తప్పితే వాటిని సీరియస్ గా తీసుకోవద్దని సూచనలు పంపారు. కదిరిలో కూడా ఇదే ఇష్యూ ప్రారంభం అయినప్పటికీ ప్రభుత్వం అక్కడి కార్యాలయాన్ని తరలించడం లేదంటూ ప్రకటించింది.దీంతో సత్యసాయి జిల్లా ఏర్పాటు విషయంలోగ హిందూపురం, ధర్మవరం ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఎంత వరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి...!

Published at : 07 Feb 2022 02:44 PM (IST) Tags: AndhraPradesh YSR Congress party Anantapur Paritala Sriram Anantapur District Telugudesam Party Hindupuram District Demand Dharmavaram Revenue Division Dharmavaram Politics

సంబంధిత కథనాలు

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Khammam Politics: సత్తుపల్లి కాంగ్రెస్‌లో డబుల్‌ గేమ్‌ - టికెట్ కోసం మాజీ మంత్రి సంబానీ, కోటూరి మధ్య పోటీ

Khammam Politics: సత్తుపల్లి కాంగ్రెస్‌లో డబుల్‌ గేమ్‌ - టికెట్ కోసం మాజీ మంత్రి సంబానీ, కోటూరి మధ్య పోటీ

Revant Reddy On Sinha : కేసీఆర్ ను మొదట కలిస్తే యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదు - తేల్చేసిన రేవంత్ !

Revant Reddy On Sinha :   కేసీఆర్ ను మొదట కలిస్తే యశ్వంత్ సిన్హా నే కాదు బ్రహ్మ దేవుడైనా కలిసేది లేదు - తేల్చేసిన రేవంత్ !

Money Heist Robber In Hyd : హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ బ్యాంక్ దొంగ - ఏం చేస్తున్నాడంటే ?

Money Heist Robber In Hyd  :  హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ బ్యాంక్ దొంగ - ఏం చేస్తున్నాడంటే ?

Yashwant Sinha About KCR: దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు

Yashwant Sinha About KCR: దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు

టాప్ స్టోరీస్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Whatsapp Report: ఒకే నెలలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ - వాట్సాప్ నివేదికలో ఏం ఉందంటే?

Whatsapp Report: ఒకే నెలలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ - వాట్సాప్ నివేదికలో ఏం ఉందంటే?