అన్వేషించండి

సముద్ర గర్భంలో కటౌట్‌, నదిలో భారీ బ్యానర్‌- వినూత్నంగా లోకేష్‌కు శుభాకాంక్షలు

తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ వినూత్నంగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖలోని సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Lokesh Birthday Celebration :  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనూ లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు, దూళ్లిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ పర్చూరు అశోక్‌బాబు తదితరులు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ లోకేష్‌ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. 

సముద్ర గర్భంలో లోకేష్‌కు విషెస్‌.. 

తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ వినూత్నంగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖలోని సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్‌ చేస్తూ ప్రణవ్‌ గోపాల్‌ భారీ లోకేష్‌ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సముద్ర గర్భంలో, ఆ తరువాత ఉపరితలంపైనా లోకేష్‌ చిత్రపటాన్ని ప్రణవ్‌ గోపాల్‌ ప్రదర్శించారు. అత్యంత ఇష్టమైన నాయకుడికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలన్న ఉద్ధేశంతోనే ఈ సాహసాన్ని చేసినట్టు ప్రణవ్‌ వెల్లడించారు. లోకేష్‌పై ఉన్న అభిమానంతోనే స్కూబా డైవింగ్‌ చేసి శుభాకాంక్షలు తెలిపానన్నారు. 

నదిలో భారీ కటౌట్‌

టీడీపీ నేత పులి చిన్న నేతృత్వంలో కృష్ణా నది మధ్యలో 100 అడుగుల కౌటట్‌ను ఏర్పాటు చేశారు. నీటిలో తేలియాడేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను బర్డ్‌వ్యూ ద్వారా చిత్రీకరించారు. 

గతంలోనూ సముద్ర గర్భంలో విషెస్..

విశాఖలో సముద్ర గర్భంలో గతంలో కూడా పలువురుకు జన్మదిన శుభాకాంక్షలు ఇలా తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు స్కూబా డైవింగ్ చేస్తూ నిర్వహించారు. అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట ను పురస్కరించుకొని పలువురు స్కూబా  డైవర్లు అతిపెద్ద రాముని చిత్రపటాన్ని ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు.

మంగళగిరిలో మహిళలు ఆధ్వర్యంలో

మంగళగిరిలోని అన్న క్యాంటీన్‌ వద్ద నారా లోకేష్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టిన రోజు వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని లోకేష్‌ చిత్రపటాన్ని పట్టుకుని శుభాకాంఓలు తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే లోకేష్‌ బాబు అంటూ మహిళలు నినాదాలు చేశారు. లోకేష్‌ చిత్రపటాలతో కూడిన ప్లకార్డులను ఈ సందర్భంగా మహిళలు ప్రదర్శించారు. జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న లోకేష్‌ మరెన్నో ఇటువంటి వేడుకలు జరుపుకోవాలని మహిళలు ఆకాంక్షించారు.

నారా లోకేష్‌ను విష్ చేసిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు జరుపుకుంటున్న నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో మమేకం కావడంతో తనదైన పంథాలో వెళ్లారని అన్నారు. ప్రజాసమస్యలు చూస్తూ రాజకీయ ఒత్తిళ్లు ప్రజలు ఎలా ఎదుర్కొన్నారో అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని పవన్ ఆశించారు. Image

 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget