(Source: ECI/ABP News/ABP Majha)
TDP Twitter Challenges : ట్విట్టర్‌లో టీడీపీ నేతల చాలెంజ్‌లు - జగన్ పాలన వైఫల్యాలు ఇలా కూడా బయట పెట్టొచ్చా ?
ట్విట్టర్‌లో జగన్ పాలన వైఫల్యాలపై వినూత్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. మూడు వైఫల్యాలు చెప్పాలంటే ఒకరికొకరు నామినేట్ చేసుకుంటూ ట్వీట్ల వార్ చేస్తున్నారు.
ప్రభుత్వంపై పోరాటంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను విభిన్నంగా ఉపయోగించుకుంటోంది. వైఎస్ఆర్‌సీపీ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా "చాలెంజ్" కాన్సెప్ట్‌తో విభిన్నంగా ప్రభుత్వ వైఫల్యాలను అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుమార్లు వైరల్ అయినా చైన్ చాలెంజ్ విధానాన్నే ఎప్పుడు ఎంచుకున్నారు. మొదటగా అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మూడు ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అమరనాథరెడ్డిలను నామినేట్ చేశారు. వారు కూడా వైఫల్యాలు చెప్పి ఇతరుల్ని నామినేట్ చేయాలన్నారు.
*బీసీలకు ఏడాదికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తాం
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 31, 2022
*పోలవరాన్ని 2020 కి పూర్తిచేస్తాం
*2.36 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను.ఇవి
జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు.ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సింది గా @GORANTLA_BC,@NAmaranathReddy గార్లను నామినేట్ చేస్తున్నాను #2YearsToByeByeJagan
అయ్యన్ననామినే్ట చేసిన నేతలు కూడా వెంటనే స్పందించారు. జగన్ ఇచ్చి అమలు చేయని హామీలను ట్వీట్ చేసి.. ఇతర నేతల్ని నామినేట్ చేశారు.
Accepted.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) May 31, 2022
*సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా,
*ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాం,
*వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 ఇస్తాం.
ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు. ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా @DevineniUma ,@ChinarajappaN గార్లను నామినేట్ చేస్తున్నాను #2YearsToByeByeJagan https://t.co/z3iMKJm8QK
Accepted.
— N Amarnath Reddy (@NAmaranathReddy) May 31, 2022
*పెట్రోల్,డీజిల్ ఛార్జీలు పెంచం,
*కరెంటు చార్జీలు తగ్గిస్తా,
*కులం చూసి కాదు, ప్రతిభను చూసి పదవులు ఇస్తాం.
ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు.ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సింది గా @KalavaTDP ,@Anitha_TDP గార్లను నామినేట్ చేస్తున్నాను. #2YearsToByeByeJagan https://t.co/G5oNrZepJq
అమర్నాథ్ రెడ్డి, బుచ్చయ్య చౌదరి చెరో ఇద్దరు నేతల్ని నామినేట్ చేశారు.
Accepted
— Kalava Srinivasulu (@KalavaTDP) May 31, 2022
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు.
3 వేల కోట్లతో ధరల స్థీరీకరణనిధి.
హంద్రీనీవా నుంచి దద్దరాల చెరువుకు నీరు తీసుకువస్తాం
ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్దానాలు.ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా @BTechRaviOff@PullaRaoP_TDP,గార్లను నామినేట్ చేస్తున్నాను #2YearsToByeByeJagan https://t.co/83dkzsfEEQ
Accepted andi.
— Anitha Vangalapudi (@Anitha_TDP) May 31, 2022
* మహిళలకు భద్రత. (లేదు)
* దిశ చట్టంతో 21 రోజుల్లో ఉరి
* మహిళలపై నేరాల అదుపు.
(25% పెరిగిన నేరాలు.)
ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్ధానాలు. ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా @AnuradhaTdp , @bhuma_akhila గార్లను నామినేట్ చేస్తున్నాను. #2YearsToByeByeJagan https://t.co/cdIy8lQqaE
ఇలా ఒకరి తర్వాత ఒకరు నామినేట్ చేసుకుంటూ పోతున్నారు. అందరూ ప్రభఉత్వ వైఫల్యాల్ని.. నెరవేర్చని హామీల్ని ట్వీట్లు చేస్తున్నారు.
Accepted andi.
— Anitha Vangalapudi (@Anitha_TDP) May 31, 2022
* మహిళలకు భద్రత. (లేదు)
* దిశ చట్టంతో 21 రోజుల్లో ఉరి
* మహిళలపై నేరాల అదుపు.
(25% పెరిగిన నేరాలు.)
ఇవి జగన్ రెడ్డి మోసపు వాగ్ధానాలు. ఇలాగే 3 వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా @AnuradhaTdp , @bhuma_akhila గార్లను నామినేట్ చేస్తున్నాను. #2YearsToByeByeJagan https://t.co/cdIy8lQqaE
ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇలా చైన్ సిస్టంలా ట్వీట్లు చేస్తూండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ పార్టీల సోషల్ మీడియా ప్రచారంలో ఇదో కొత్త ఒరవడి అని టీడీపీ కార్యకర్తలు కూడా హుషారుగా షేర్ చేసుకుంటున్నారు.