By: ABP Desam | Updated at : 12 May 2022 03:13 PM (IST)
అంబటిపై అయ్యన్న సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయట ప్రపంచానికి తెలుస్తాయని అయ్యన్న ప్రకటించారు. ఇవేమీ రహస్యం కాదని సీఎం సహా చేరాల్సిన వారి దగ్గరకు చేరాని త్వరలో అంబటి రాంబాబును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమని ఆయన ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ట్వీట్ వైరల్ అవుతోంది.
సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబు కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్...ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం 1/2
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2022
అంబటి రాంబాబుపై కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలకూ కౌంటర్ ఇచ్చారు.
హస్కీ వాయిస్ తో ఆడియో లు లికైతే కాంబాబు అనకపోతే రాంబాబు అంటారా? నారాయణ గారి అరెస్ట్ కి ఆధారాలు లేవు, నీ పరువు తక్కువ పనులకు ఆడియోలు ఉన్నాయి కాంబాబు! https://t.co/ZhN11bkhbh
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 10, 2022
అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అంబటి రాంబాబుపై ఈ తరహా ఆరోపణలు ఉండటమే. గతంలో సంజనా అనే మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే తనను ట్రాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల సుకన్య అనే మహిళతో మాట్లాడినట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అవి తనవి కాదని అంబటి రాంబాబు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో మార్ఫింగ్ ఆడియోలు రిలీజ్ చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అవి ఆయనవేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది.
ఇప్పుడు మహిళా జర్నలిస్టు విషయంలోనూ ఆయన అంతే అసభ్యంగా మాట్లాడినట్లుగా అయ్యన్న చెబుతున్నారు. పైగా వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. వాట్సాప్ రికార్డులని ఆయన చెబుతున్నారు.పైగా ప్రభుత్వ పెద్దలకూ చేరినట్లుగా చెబుతున్నారు.దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు కానీ అంబటి రాంబాబు కానీ ఇంకా స్పందించలేదు.
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్రావు, పార్థసారధి నామినేషన్ దాఖలు
BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?
Five Congress Leaders : కాంగ్రెస్కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?
3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలనలో నవరత్నాలు మెరిసినదెంత ? ప్రజలకు చేరిందెంత ?
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు