అన్వేషించండి

TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?

Chandrababu Naidu Action On MLAs: ఏపీలో దారి తప్పుతున్న టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు ఇవ్వడం మానేశారు చంద్రబాబు. నేరుగా పక్కన పెట్టేస్తున్నారు.

TDP Black List: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అధికార తెలుగుదేశం పార్టీ  లో అంతర్గత క్రమశిక్షణపై ఆ పార్టీ హైకమాండ్ అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఉత్సాహంలో కొందరు ఎమ్మెల్యేలు రూట్ మారుస్తూ, పార్టీ గీసిన లక్ష్మణ రేఖను దాటుతుండటంపై అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్‌కు దిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత క్యాడర్‌తో విభేదాలు, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న కొందరు శాసనసభ్యులను హెచ్చరించడం మానేసి.. నేరుగా దూరం పెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోంది.  
 
 కొలికపూడి ఓపెన్ రెబెలిజం.. తిరువూరులో మారిన సమీకరణాలు! 

తిరువూరు  ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొదటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పార్టీ హైకమాండ్ నిర్ణయాలను బహిరంగంగానే ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ అధిష్ఠానం పలుమార్లు అంతర్గతంగా హెచ్చరించినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో టీడీపీ అగ్రనాయకత్వం ఆయనను పూర్తిగా పక్కనబెట్టేసింది.  ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణను ఇప్పటికే ఇతర నేతలు చూస్తున్నారు.  ఆయనను కేవలం  పేరుకే ఎమ్మెల్యే  అన్నట్లుగా మార్చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా ఇదే గతి పడుతుందనేందుకు కొలికపూడి ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలిచింది.

 సత్యవేడులో వివాదాల సుడిగుండం.. క్యాడర్‌కు దూరమైన ఎమ్మెల్యే! 

మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం ప్రవర్తన కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మహిళతో వివాదాస్పదంగా ప్రవర్తించి వార్తాల్లోకి ఎక్కిన ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ వివాదం సెటిల్ చేసుకున్నా ఆయనను పార్టీలో కలుపుకోలేదు. అందుకే ఆయన కుమారుడు ఇటీవల ప్రెస్మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినా టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు.  సత్యవేడులో  క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలు సైతం ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా, సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ ద్వారా గ్రహించిన చంద్రబాబు.. సత్యవేడులో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పనులు జరిగేలా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. తద్వారా క్యాడర్‌ను కాపాడుకుంటూనే, ఎమ్మెల్యేకు గట్టి షాక్ ఇచ్చారు. 

 ఆ ‘పది మంది’పై హైకమాండ్ నజర్.. బ్లాక్‌లిస్ట్‌ రెడీ! 

 కేవలం ఈ ఇద్దరే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది మందికి పైగా ఎమ్మెల్యేల జాబితాను   పార్టీ ఇంటెలిజెన్స్ వింగ్ సిద్ధం చేసింది. అధికారం అండతో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం, ఇసుక, భూ దందాల్లో తలదూర్చడం, కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించకుండా వివాదాలు కొనితెచ్చుకోవడం వంటి నెగెటివ్ రిపోర్ట్స్ ఉన్న నేతలందరినీ ఈ లిస్టులో చేర్చారు. వీరిలో కొందరు ఉత్తరాంధ్ర, మరికొందరు రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. 
 
 పరిపాలన ముఖ్యం.. రాజకీయం కాదు 

గతంలో  2014-19 మధ్య కాలంలో కొందరు ఎమ్మెల్యేల మితిమీరిన ప్రవర్తన వల్లే పార్టీ 23 సీట్లకు పడిపోయిందనే చేదు నిజాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మర్చిపోలేదు. అందుకే, ఈసారి 135 కి పైగా సీట్ల భారీ మెజారిటీ ఉండటంతో.. ఒకరిద్దరు లేదా పది మంది ఎమ్మెల్యేలు దూరమైనా ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదనే ధీమాతో హైకమాండ్ ఉంది.  వ్యవస్థ ముఖ్యం, ప్రజల్లో పార్టీ ఇమేజ్ ముఖ్యం.. అంతేకానీ దారి తప్పిన ఎమ్మెల్యేల కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టలేం  అని లోకేష్, చంద్రబాబు ఇద్దరూ అంతర్గత సమావేశాల్లో తెగేసి చెప్పారు. మారమని హెచ్చరించడం కంటే, వారిని పక్కనబెట్టి ప్రత్యామ్నాయ నేతలను తయారు చేయడం  ద్వారా సదరు ఎమ్మెల్యేల పొగరు దించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
 
 వచ్చే ఎన్నికల్లో టికెట్లకు ఇప్పుడే కోత సంకేతాలు! 

టీడీపీ హైకమాండ్ తీసుకుంటున్న ఈ నిశ్శబ్ద అడుగులు.. సదరు వివాదాస్పద ఎమ్మెల్యేలకు భవిష్యత్తుపై పెద్ద హెచ్చరికగా మారాయి. ప్రస్తుతం వీరిని దూరం పెట్టడం అంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు దక్కే ప్రసక్తే లేదనే సంకేతాన్ని క్యాడర్‌కు బలంగా పంపడమే. సోషల్ మీడియాలో కూడా ఈ ఐసోలేషన్ స్ట్రాటజీపై సామాన్య కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు తప్పు చేస్తే వెనకేసుకొచ్చే పాత రోజులు పోయాయని, పద్ధతి మార్చుకోకపోతే ఎంతటి సీనియర్ అయినా  మాజీ  అవ్వక తప్పదని టీడీపీ పంపుతున్న ఈ స్ట్రాంగ్ మెసేజ్.. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా దారిలోకి తెస్తుందని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget