అన్వేషించండి

TDP MLAs: టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు చక్రవర్తులా? - ధ్యానం సలహాతో వారిని చంద్రబాబు దారిలో పెట్టగలరా?

Chandrababu Naidu: ఎమ్మెల్యేలను చంద్రబాబు దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.

TDP MLAs on Wrong track:   ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం కుదరడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. తాము చెప్పిన పనులు జరగడం లేదని, అధికారుల నుండి సరైన గౌరవం దక్కడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఏకంగా పది గంటల పాటు ధర్నాకు దిగడం, గదిలో బంధించుకుని నిరసన తెలపడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తాము సిఫార్సు చేసిన వారికే పోస్టింగ్ ఇవ్వాలన్న పట్టుదల, అధికారులపై ఒత్తిడి తేవడం వంటి పరిణామాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

 శాంతి కోసం ధ్యానం.. చంద్రబాబు మార్క్ కౌన్సెలింగ్! 

ఎమ్మెల్యేల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉద్రేకాలకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యేలందరూ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని, నిరంతరం ఒత్తిడికి గురవుతున్న వారు మెడిటేషన్  చేయాలని ఆయన సూచించారు. గతంలో కూడా చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు, అధికారులకు ఈషా ఫౌండేషన్ వంటి ఆధ్యాత్మిక సంస్థల ద్వారా యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో ఎమ్మెల్యేల మనసులను ప్రశాంతం చేయాలని, వారు ప్రజల మధ్య సంయమనంతో ఉండేలా చేయాలని బాబు భావిస్తున్నారు.

 కింగ్ మేకర్లు కాదు.. ప్రజల సేవకులమే! 

చాలామంది ఎమ్మెల్యేలు తాము గెలిచిన నియోజకవర్గాలకు  మేమే కింగులం  అనే భావనలో ఉండటం వల్లే ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులపై హుకుం జారీ చేయడం, వారి గౌరవానికి భంగం కలిగించడం ద్వారా పనులు జరగవని, అది కేవలం అరాచకానికి దారితీస్తుందని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అధికారం అంటే బాధ్యత అని, అది అహంకారానికి వేదిక కాకూడదని హితవు పలికారు. ధ్యానం ద్వారా ఎమ్మెల్యేలలో ఉన్న ఆ అహంకారాన్ని తొలగించి, వారిని సేవా మార్గంలోకి మళ్లించడమే బాబు లక్ష్యంగా కనిపిస్తోంది.

 అనుభవమే పాఠం.. అదుపు తప్పితే చర్యలే! 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీస్ స్టేషన్లు,  ఎస్పీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయడం వంటి చర్యలు గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తు చేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి కేవలం హెచ్చరికలతోనే సరిపెట్టకుండా, ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా పెట్టడమే కాకుండా వారికి మానసిక వికాస తరగతులు   నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ధ్యానం, యోగా వంటి శిక్షణల తర్వాత కూడా ఎమ్మెల్యేల తీరు మారకపోతే, కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు.

 రాజకీయంగా  బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిందే! 

ప్రస్తుత రాజకీయాల్లో కేవలం గెలిస్తే సరిపోదు, ప్రజల ముందు ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా ముఖ్యమని చంద్రబాబు నమ్ముతారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలందరికీ ప్రొఫెషనల్ టైనర్లతో వర్క్‌షాప్‌లు నిర్వహించే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కంటే కూడా నాయకుల ప్రవర్తనే ఎన్నికల్లో కీలకం కానుందని, అందుకే ఎమ్మెల్యేలు తమ బాడీ లాంగ్వేజ్  ను మార్చుకుని, అధికారులతో కలిసి పనిచేయాలని అధిష్టానం నిర్దేశించింది. ఈ  మెడిటేషన్  మంత్రం ఎంతవరకు ఎమ్మెల్యేలలో మార్పు తెస్తుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget