అన్వేషించండి

Nara Lokesh: టార్గెట్ మంగ‌ళ‌గిరి - నారా లోకేష్ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు, వైసీపీలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మేంటి?

AP Politics: రానున్న ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చెబుతున్నారు. మ‌రి ఆయ‌న బ‌లం ఏంటి? బ‌ల‌హీన‌త‌లు ఏంటి? ఓసారి చూస్తే!

Target Mangalagiri: రాజ‌కీయాల్లో(Politics) ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న ఓడిన నేత‌.. రేపు భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకోవ‌చ్చు. నిన్న బ‌ల‌మైన నాయ‌కుడు.. రేపు బ‌ల‌హీన‌మైన నేత‌గా మారిపోవ‌చ్చు. ప్ర‌జ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటివి నాయ‌కుల‌ గెలుపోటములను ప్ర‌భావితం చేస్తాయి. ఎవ‌రూ ఎప్పుడూ విఫ‌లం కావాల‌ని కూడా ఉండ‌దు. అదే స‌మ‌యంలో ఒకే నేత ప‌రిప‌రి విధాలా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని కూడా ఉండ‌దు. ఇదే ఫార్ములాను.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ(TDP) యువ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(NaraLokesh) ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయ‌న ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి(Mangalagiri) నుంచి పోటీ చేశారు. అప్ప‌టి అంచ‌నాల మేర‌కు.. ఆయ‌న విజ‌యం `ప‌క్కా` అని టీడీపీ నాయ‌కులు రాసిపెట్టుకున్నారు. రాజ‌ధానిగా ఇక్క‌డి అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక‌ చేయ‌డం.. యువ నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఉండడం. హైప్రొఫెల్ నాయ‌కుడిగా నారా చంద్ర‌బాబు(Nara chandrababu)కు భారీ గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ వార‌సుడిగా ఉన్న నారాలోకేష్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావించారు. కానీ, 2019లో ఈ లెక్క‌లు విఫ‌ల‌మ‌య్యాయి. అప్ప‌టి ఎన్నిక‌ల్లో వ‌రుసగా పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎమ్మెల్యే(MLA).. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(Alla Ramakrishnareddy) విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు సాగింది. టీడీపీ, వైఎస్సార్ సీపీల‌తో పాటు.. జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టుల మిత్రప‌క్షం త‌ర‌ఫున ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలిపోయి.. నారా లోకేష్ 5,333 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వ‌రుస విజ‌యాలు దక్కించుకున్నారు. 

సీరియ‌స్‌గా ఇప్పుడు.. 

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఇక్క‌డ నుంచే నారా లోకేష్ పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ప‌డిన చోటి నుంచే పైకి లేవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పట్టుదలగా ఇక్క‌డ‌ పని చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ఓడిపోయినా.. ఆయ‌న హ‌వా మాత్రం చెక్కు చెద‌ర‌లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు చేనేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వీధి వ్యాపారుల‌కు తోపుడు బండ్లు ఇచ్చి..వారిని ప్రోత్స‌హిస్తున్నారు. మ‌రోవైపు.. నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి కూడా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త నారా లోకేష్‌ను గెలిపించాల‌ని ఆమె కోరుతున్నారు. మెజారిటీ సామాజిక వ‌ర్గం ఇక్క‌డ చేనేత‌లే కావ‌డంతో వారిని ల‌క్ష్యంగా చేసుకుని నారాలోకేష్ ముందుకు సాగుతున్నారు. 

వైసీపీ వ్యూహం ఇదీ.. 

నారా లోకేష్‌ను ఓడించి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ కూడా మంగ‌ళ‌గిరిపై ప్ర‌త్యేకంగా కాన్సంట్రేష‌న్ పెంచేసింది. మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆళ్ల ఇటీవ‌ల వైసీపీకి గుడ్ బై చెప్పారు.( మ‌ళ్లీ తిరిగి వెన‌క్కి వ‌చ్చారు) దీంతో మంగళగిరిలో `బీసీ కార్డు` ప్రయోగానికి వైసీపీ సిద్ధ‌మైంది. చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. ముందుగా చిరంజీవికి టికెట్ ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. నారా లోకేష్ వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టిన వైసీపీ..ఇక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ వి.విజ‌య‌సాయిరెడ్డిని తాజాగా రంగంలోకి దించింది. ఆయ‌న వ‌చ్చి.. నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌తో భేటీ అయ్యారు. నారా లోకేష్ దూకుడు, వైసీపీప్ర‌చారం వంటి వాటిని ఆయ‌న తెలుసుకున్నారు. లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో  ఉన్న వైసీపీ ఏ క్ష‌ణ‌మైనా అభ్య‌ర్థిని మార్చ‌వ‌చ్చనే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. అలిగి వెళ్లిపోయిన ఆళ్ల‌ను తిరిగి చేర్చుకోవ‌డం ద్వారా.. వైసీపీ ప‌ట్టుకోల్పోకుండా.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు చీల‌కుండా కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

నారా లోకేష్ బలాలు ఇవీ.. 

+ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి

+ అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు.

+ యువ‌గ‌ళం పాద‌యాత్ర తాలూకు సింప‌తీ

+ బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తార‌నే చ‌ర్చ‌.

+ స్థానికంగా చేప‌ట్టిన అన్నా క్యాంటీన్ వంటి.. కార్య‌క్ర‌మాలు.

+ యువ నాయ‌కుడు, యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్న‌తీరు.

బ‌ల‌హీన‌త‌లు ఇవీ.. 

+ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాక‌పోవ‌డం.

+ బీసీ సామాజిక వ‌ర్గ‌మైన చేనేత‌ల్లో బ‌ల‌మైన ఓటు బ్యాంకును ఈయ‌న త‌న‌వైపు తిప్పుకోలేక‌పోతున్నార‌నే వాద‌న‌.

టాప్ హెడ్ లైన్స్

CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
YSRCP AP Assembly : పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?
పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget