అన్వేషించండి

AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?

Tamil Nadu politics 2026: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే నుండి ఎమ్మెల్యేల రాజీనామాలు, వారు విజయ్ నేతృత్వంలోని టీవీకే లో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Vijay TVK party by-elections:   తమిళనాడు రాజకీయ ముఖచిత్రం 2026 మే నెలలో జరిగిన ఎన్నికలతో పూర్తిగా మారిపోయింది. విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం  అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. డీఎంకే మిత్రపక్షాలు టీవీకే వైపు రావడంతో ఇప్పటికి అంతా సేఫ్ గా ఉంది. అయితే విజయ్ తన ప్రభుత్వానికి మరింత స్థిరీకరణ కోరుకుటున్నారు. అందుకే రెబల్స్ గా మారిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తున్నారు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశఆరు.  రాజీనామా చేసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలకు టీవీకే అధిష్టానం రాబోయే ఉపఎన్నికల్లో మళ్ళీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఇక్కడే అసలైన సవాల్ మొదలవుతుంది.  

విజయ్ వేవ్‌పై నమ్మకం

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పదిహేను రోజుల క్రితమే అన్నాడీఎంకే  రెండాకులు గుర్తుపై గెలిచారు. ఇప్పుడు విజయ్ పార్టీ గుర్తుపై పోటీ చేసినప్పుడు ప్రజలు అదే స్థాయిలో ఆదరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి తప్పించుకోవడానికి వీరు రాజీనామా మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ, ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో బలమైన వ్యక్తిగత వర్గం ఉంది. ముఖ్యంగా ఎస్.పి. వేలుమణి వర్గానికి చెందిన వీరికి నియోజకవర్గాల్లో పట్టు ఉంది. దీనికి తోడు ప్రస్తుతం తమిళనాడులో వీస్తున్న విజయ్ వేవ్ వీరికి కలిసివచ్చే అతిపెద్ద ప్లస్ పాయింట్. యువత మరియు మహిళా ఓటర్లు విజయ్ నాయకత్వాన్ని బలపరుస్తుండటం వల్ల, వీరు తమ సొంత ఇమేజ్ మరియు విజయ్ క్రేజ్ తో సులభంగా గెలుస్తారని టీవీకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఓడించి తీరాలనే పట్టుదలతో అన్నాడీఎంకే, డీఎంకే 

 అన్నాడీఎంకే కేడర్ ఈ రాజీనామాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పళనిస్వామి నాయకత్వం వీరిని ద్రోహులు గా ముద్ర వేసి, ఉపఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది.  రెండాకుల గుర్తుపై గెలిచి, సినిమాల సెలబ్రిటీ పంచన చేరిన వారిని ప్రజలు క్షమించరు  అని ఈపీఎస్ ఇప్పటికే హెచ్చరించారు. అన్నాడీఎంకేకు ఉన్న పటిష్టమైన గ్రామస్థాయి ఓటు బ్యాంకు ఇప్పుడు వీరిపై వ్యతిరేకంగా పనిచేస్తే గట్టి పోటీ తప్పదు. డీఎంకే కూడా వీరిని ఓడించడానికి గరిష్టంగా ప్రయత్నించే అవకాశం ఉంది.  తమిళనాడులో పార్టీలు మారి ఉపఎన్నికల్లో గెలిచిన దాఖలాలు ఉన్నాయి . కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ మీడియా యుగంలో ఓటరు చైతన్యం పెరిగింది.  వార్డు మెంబర్  స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన కేడర్, పార్టీని వీడిన నేతల వెంట వెళ్తుందా లేక పార్టీకే కట్టుబడి ఉంటుందా అనే దానిపైనే ఈ నలుగురి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఉపఎన్నికలు టీవీకే భవిష్యత్‌కు కీలకం

  ఈ ఉపఎన్నికలు కేవలం నలుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తునే కాదు, తమిళనాడులో అన్నాడీఎంకేతో పాటు టీవీకే మనుగడను కూడా నిర్ణయించబోతున్నాయి. విజయ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ గెలుపు అత్యవసరం. ఒకవేళ వీరు గెలిస్తే, అన్నాడీఎంకే నుండి మరిన్ని రాజీనామాలు వచ్చే ప్రమాదం ఉంది. లేదంటే, అన్నాడీఎంకేకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా, ఈ ఉపఎన్నికల పోరు  సినిమా వర్సెస్ సింబల్ లా మారబోతోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget