అన్వేషించండి

Thalapathy Vijay: అమ్మ వారసుడిగా విజయ్ - అన్నాడీఎంకే కోటను కూల్చే మాస్టర్ ప్లాన్ - కాపాడుకోవడం పళనిస్వామికి కష్టమేనా?

TamilNadu Politics: బలమైన నాయకత్వం లేని అమ్మ పార్టీ అన్నాడీఎంకేను పూర్తిగా దెబ్బకొట్టి ఆమ్మ రాజకీయ వారసత్వం తనదేనని విజయ్ నిరూపించేలా రాజకీయం చేస్తున్నారు.

Jayalalithaa Legacy Thalapathy Vijay:  తమిళనాడు రాజకీయాల్లో ఆరు దశాబ్దాల ద్రవిడ దిగ్గజాల  ఏకఛత్రాధిపత్యానికి గండికొడుతూ,  తమిళగ వెట్రి కజగం అధినేత, నూతన ముఖ్యమంత్రి దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 34.92 శాతం ఓట్ల షేర్‌తో 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఒకప్పుడు ఎంజీఆర్, జయలలిత అనుభవించిన అపారమైన ప్రజాధరణను ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ తన సొంతం చేసుకున్నారు. అన్నాడీఎంకే  నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, ఆ పార్టీ కేడర్ ,  ఓటర్లకు విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపించారు.  అమ్మ ఆశయాలను, ప్రజా రంజక పాలనను నేనే ముందుకు తీసుకెళ్తాను అనే నినాదంతో ఆయన నేరుగా అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంకుపై గురి పెట్టారు.  

అన్నాడీఎంకేకు  వార్నింగ్  బెల్  

అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయ్ ప్రదర్శించిన రాజకీయ తెలివితేటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన ప్రభుత్వానికి మెజార్టీ తగ్గకుండా ఉండటమే కాకుండా, విపక్ష అన్నాడీఎంకేను ఆయన కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఎడప్పాడి పళనిస్వామి  నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి విజయ్ వైపు నిలబడటం తమిళనాట ఒక చారిత్రాత్మక మలుపు. ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం వంటి అగ్రనేతల వర్గం విజయ్‌కు జై కొట్టడం చూస్తుంటే.. అన్నాడీఎంకే శకం ముగిసిందని, ఆ పార్టీలోని శక్తివంతమైన వర్గాలన్నీ ఇక శాశ్వతంగా టీవీకే గూటికి చేరిపోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 పథకాలతో  అమ్మ సెంటిమెంట్‌కు జవజీవాలు 

విజయ్ కేవలం రాజకీయంగానే కాకుండా, పాలనాపరంగా కూడా జయలలిత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గత డీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన  అమ్మ క్యాంటీన్ల ను తిరిగి ప్రారంభించడమే కాకుండా, వాటిని అత్యంత ఆధునికీకరించి పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన  వెంటనే నిర్ణయం తీసుకోవడం ద్వారా.. తాను జయలలితకు అసలైన రాజకీయ వారసుడిని అని విజయ్ నిరూపించుకున్నారు.  తమిళనాడులో డీఎంకేను వ్యతిరేకించే ఓటు బ్యాంకు ఎప్పుడూ ఒక పార్టీని బలంగా నిలబెడుతుంది. గతంలో ఆ పాత్రను అన్నాడీఎంకే పోషించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని విజయ్ ఆక్రమించారు.  స్టాలిన్, ఉదయనిధిల నేతృత్వంలోని డీఎంకేను ఎదుర్కోగల ఏకైక శక్తి టీవీకే మాత్రమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

 సిద్ధాంతాల కలయిక - ద్రవిడ జాతీయవాదం 

విజయ్ తన సిద్ధాంతాన్ని  ద్రవిడ జాతీయవాదం, సామాజిక న్యాయం గా ప్రకటించడం ఒక మాస్టర్ స్ట్రోక్. ద్రవిడ పార్టీల అవినీతిని, వారసత్వ రాజకీయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారే తప్ప.. తమిళ అస్తిత్వానికి మూలమైన పెరియార్, అంబేద్కర్ ఆశయాలకు తాను వ్యతిరేకం కాదని చాటారు. తన ప్రచార పటాల్లో పెరియార్, కామరాజ్ వంటి మహానుభావుల చిత్రాలను ఉంచడం ద్వారా ద్రవిడ ఓటర్ల మనసు గెలుచుకున్నారు. కేవలం సోషల్ మీడియా హైప్‌తోనే విజయ్ గెలిచారనే విమర్శలను తుడిచిపెట్టి, క్షేత్రస్థాయిలో అన్నాడీఎంకేను కనుమరుగు చేస్తూ విజయ్ ఒక నూతన ద్రవిడ శకానికి నాంది పలికారు.              

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget