అన్వేషించండి

TVK Government: తమిళనాడు సీఎంగా విజయ్ - ఖజానా ఖాళీ.. 10 లక్షల కోట్ల అప్పు.. దళపతి కి అసలైన పరీక్ష ఇప్పుడే!

Stalin Vs Vijay: ముఖ్యమంత్రి విజయ్‌కు పిరాడనివ్వని సవాళ్లు ఎదురవుతున్నాయి. వెండితెరపై అసాధ్యాలను సుసాధ్యం చేసే హీరోగా మెప్పించిన ఆయనకు, ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అనే అతిపెద్ద విలన్ ఎదురుగా నిలబడింది.

Tamilnadu CM Vijay Financial Challenges:  తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్  బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రం సుమారు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని ఆయన ఆరోపిస్తున్నారు. పరిపాలనా అనుభవం లేని విజయ్, ఇప్పుడు ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, గత అప్పులకు వడ్డీలు చెల్లించడమే గగనంగా మారిన తరుణంలో బాధ్యతలు చేపట్టారు. ఈ ఆర్థిక సందిగ్ధతను అధిగమించేందుకు ఆయన త్వరలోనే  వైట్ పేపర్  విడుదల చేస్తానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది.

 హామీల అమలు - ఆర్థిక భారం 

ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయనకు కత్తి మీద సాములా మారాయి. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయంలో దాదాపు మూడో వంతు నిధులు వీటికే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి, ఈ అదనపు భారం భరించడం సాధ్యమేనా అన్నది ఆర్థిక నిపుణుల ప్రశ్న. అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లోనే ఈ హామీలపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో అసంతృప్తి మొదలయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

 అనుభవం లేని యంత్రాంగం - అధికారులపై ఆధారపడటం 

విజయ్ మాత్రమే కాకుండా, ఆయన క్యాబినెట్‌లోని మెజారిటీ మంత్రులకు పరిపాలనలో కనీస అనుభవం లేదు. వ్యవస్థ ఎలా నడుస్తుంది? నిధుల సమీకరణ ఎలా చేయాలి? కేంద్రంతో ఎలా డీల్ చేయాలి? అన్న విషయాల్లో వారు పూర్తిగా ఐఏఎస్ అధికారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సీనియర్ అధికారులను తన దారిలోకి తెచ్చుకుని, పాత పద్ధతులను మారుస్తూ కొత్త విధానాలను అమలు చేయడం విజయ్‌కు పెద్ద సవాల్. అధికారుల మీద పట్టు సాధించడంలో విఫలమైతే, పాలన గాడి తప్పే అవకాశం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు చాలా కీలకం. అయితే, బీజేపీయేతర కూటమి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్‌కు, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభిస్తుందా అన్నది అనుమానమే. ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ, రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక ప్యాకేజీలు లేదా నిధుల విషయంలో కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. ఒకవేళ కేంద్రం నుంచి సహకారం అందకపోతే, రాష్ట్రం మరింత రుణభారంలో పడిపోవడం ఖాయం.
 
ద్రవిడ కోటలో విజయ్ మోడల్ నిలుస్తుందా? 

దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగిన తమిళ రాజకీయాలను కాదని ప్రజలు విజయ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే, పాత ప్రభుత్వాల మాదిరిగానే  ఉచితాల బాటలో నడిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తనదైన ముద్ర వేయాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్న విజయ్, రొటీన్ రాజకీయాలకు భిన్నంగా ఆర్థిక క్రమశిక్షణను ఎలా పాటిస్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ ఆర్థిక సమస్యల వల్ల సంక్షేమ పథకాలు నిలిచిపోతే, అది విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారుతుంది.విజయ్ తన సినిమా కెరీర్‌లో ఎన్నో క్లిష్టమైన క్లైమాక్స్‌లను ఎదుర్కొన్నారు. కానీ, ఈ  ఫైనాన్షియల్ క్లైమాక్స్ నుండి తమిళనాడును ఎలా గట్టెక్కిస్తారో అన్నదే ఇప్పుడు దేశవ్యాప్త ఉత్కంఠ. రాబోయే 100 రోజులు విజయ్ ప్రభుత్వానికి అగ్నిపరీక్ష వంటివే.
 

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?

వీడియోలు

Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget