అన్వేషించండి

Sunil Bansal Telangana BJP incharge: తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా మళ్లీ సునీల్ బన్సల్ - కాంగ్రెస్ vs బీజేపీ ఫైట్‌కు సరికొత్త స్కెచ్.. మిషన్ తెలంగాణ సాధ్యమేనా?

Sunil Bansal : తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ను మళ్లీ అధిష్టానం నియమించింది. 8 ఎంపీ సీట్ల గెలుపు తర్వాత బన్సల్ టీమ్ ముందున్న అసలైన టాస్క్ ఏంటి?

BJP Telangana strategy Congress vs BJP:   తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో అధిష్టానం కీలక అడుగు వేసింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ వ్యూహకర్త సునీల్ బన్సల్‌నే మళ్లీ నియమిస్తూ, ఆయనకు సహకారంగా ఇద్దరు సహ ఇన్‌ఛార్జులను కూడా రంగాంలోకి దించింది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, దాదాపు 35 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించి కమలదళం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏకైక ప్రత్యామ్నాయం తామేనన్న భావనను ప్రజల్లో బలంగా నాటడమే ప్రాథమిక లక్ష్యంగా బన్సల్ నాయకత్వంలో కొత్త టీమ్ రంగంలోకి దిగుతోంది.

బీజేపీని రేసులోకి తేవడమే ముఖ్యం

ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వరుస పరాజయాలు, నాయకుల వలసలు,  అంతర్గత సంక్షోభంతో తీవ్రంగా కొట్టుమిట్టాడుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సొంత కేడర్‌ను కాపాడుకునేందుకు ఆ పార్టీ గులాబీ అధినేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ రాజకీయ శూన్యతను పూర్తిగా వాడుకుని, బీఆర్‌ఎస్ ఆక్రమించి ఉన్న ద్వితీయ స్థానాన్ని తమ వశం చేసుకోవడం బన్సల్ టీమ్ ముందున్న అత్యంత ప్రధానమైన టాస్క్. తెలంగాణలో రాజకీయ పోరును ఇకపై కాంగ్రెస్ vs బీజేపీ గా మార్చడమే వారి అసలైన వ్యూహం. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి విజయతీరాలకు చేర్చడంలో సునీల్ బన్సల్ పాత్ర అత్యంత కీలకం. బూత్ స్థాయి నెట్‌వర్క్ నిర్వహణలో మరియు ఆర్గానైజేషనల్ ప్లానింగ్‌లో ఆయన దిట్ట.   గ్రౌండ్ లెవల్ పట్టును పెంచేందుకు ఆయన సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీజేపీ జెండా ఎగురవేస్తేనే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాది ఏర్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

అంత ఈజీ కాదు! 

అయితే బన్సల్ ముందున్న బాట అంత సులువేమీ కాదు. పార్లమెంట్ ఎన్నికల నాటి ప్రధాని మోదీ హవా, స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ పోరులో ఒకేలా పనిచేయదు. పైగా క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్లస్టర్ నాయకత్వం ఉన్నప్పటికీ, వివిధ జిల్లాల్లో పార్టీ విభేదాలు, ముఠా తత్వాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి. సీనియర్లు, కొత్తగా చేరిన నేతల మధ్య సమన్వయం కుదర్చడం, పార్టీ ఐక్యతను చాటడం బన్సల్ ఇద్దరు సహ ఇన్‌ఛార్జులతో కలిసి అధిగమించాల్సిన అతిపెద్ద పరిమితి.  బీజేపీకి రాబోయే ఒక సంవత్సరం అత్యంత కీలకమైన టైమ్ విండో. వచ్చే ఏడాది కాలంలో పార్టీ తన శ్రేణులను ఏకీకృతం చేసి, నిరసనలతో ప్రజల్లో ఉంటూ పుంజుకోకపోతే, తెలంగాణ రేసులో నిలవడం కష్టమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలు, పాలనా విధానాలను గట్టిగా ప్రశ్నిస్తూనే, బీఆర్‌ఎస్ స్పేస్‌ను సొంతం చేసుకోగలిగితేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది. లేనిపక్షంలో మళ్లీ ప్రాంతీయ సమీకరణాలు పుంజుకునే అవకాశం ఉంటుంది.

బన్సర్ రీయాక్టివ్ అయితే బీజేపీ కార్యకలాపాలు పెరిగే చాన్స్  

 బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్‌కు డెరెక్ట్ టార్గెట్ బీజేపీనే అని బీజేపీ కేడర్ ట్రెండ్ చేస్తుంటే, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేరు, లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు వేరని ప్రత్యర్థి పార్టీలు కౌంటర్ ఇస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, సునీల్ బన్సల్ రీ-ఎంట్రీతో తెలంగాణ బీజేపీకి సరికొత్త పొలిటికల్ బూస్టర్ డోస్ లభించిందనడంలో సందేహం లేదు. కానీ బీజేపీ నాయకులు ఎంత మేర ఉపయోగించుకుంటారన్నదే కీలకం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget