అన్వేషించండి

Telangana committee probe KCR lands : కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు ల్యాండ్ డీల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు!

Telangana: పదేళ్లలో జరిగిన భూ వివాదాలు, సెక్షన్ 22-ఎ ఉల్లంఘనలపై ఐఏఎస్ శ్రీదేవసేన అధ్యక్షతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. BRS నేతల భూములపై వస్తున్న ఆరోపణలతో ఈ కమిటీ కీలకంగా మారింది.

Telangana government GO Ms No 134 land enquiry: మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు  , మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితులకు అనుసంధానమై ఉన్న గ్రామాల పరిధిలోని భూముల కేటాయింపులు, రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది.

ఈ ఉన్నత స్థాయి కమిటీకి సాంకేతిక, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన  చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు  కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా   సభ్యుడిగా, ఏ జిల్లాకు చెందిన భూములపై విచారణ జరుగుతుందో ఆ జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

కమిటీని ఎందుకు వేయాల్సి వచ్చింది? 

తెలంగాణ శాసనసభలో రిజిస్ట్రేషన్ల చట్టం  సెక్షన్ 22-ఎ  దుర్వినియోగం,  నిషేధిత భూముల పరిధిపై జరిగిన తీవ్ర చర్చ ఈ కమిటీ ఏర్పాటుకు ప్రధాన కారణమైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, అసైన్డ్ భూములు, జాగీర్, భూదాన్, ఇనామ్ ,  అటవీ భూములతో పాటు చెరువులు, కుంటల పరివాహక ప్రాంతాల  భూములను సెక్షన్ 22-ఎ జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించి, మార్పిడి చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సభలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడానికి కమిటీ ద్వారా పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విచారణ కమిటీకి ప్రభుత్వం విస్తృతమైన అధికారాలను కల్పించింది. సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నిర్దేశిత గ్రామాల్లో చట్టాలు, జీఓలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలను ఈ కమిటీ సవివరంగా పరిశీలిస్తుంది. ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే అందుకు బాధ్యులైన అధికారుల నుండి రాజకీయ నాయకుల వరకు జవాబుదారీతనం ఖరారు చేసి, తగిన చట్టపరమైన చర్యలను కమిటీ సిఫార్సు చేస్తుంది. అంతేకాకుండా, దీనికి సంబంధించిన అన్ని రకాల భూ రికార్డులను సమర్పించాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సిసిఎల్ఎ ,  రిజిస్ట్రేషన్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ ల్యాండ్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు   సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న అగ్రనేతలు, వారి బంధువులతో ముడిపడి ఉన్న భూముల భూభాగాలను లక్ష్యంగా చేసుకుని విచారణ సాగుతుండటంతో, అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు  కీలకంగా మారనున్నాయి.                       

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Sonia Gandhi Biopic: సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
సోనియా గాంధీ బయోపిక్‌ డైరెక్టర్ ఫిక్స్.. క్రాంతి మాధవ్ పేరును ప్రకటించిన జగ్గారెడ్డి!
KTR on Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. ఏబీపీ వేదికగా ముందే చెప్పిన కేటీఆర్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
యాచించి కాదు, శాసించి సాధించాం.. ఢిల్లీ మెడలు వంచిన నేత కేసీఆర్: అలుగునూరు సభలో కేటీఆర్
Rayapati Sambasiva Rao Passes Away: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూత.. ప్రముఖులు సంతాపం
Amanchi Krishna Mohan: వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
వేటపాలెంలో దొంగ ఓట్ల వివాదం.. ఆమంచి కృష్ణమోహన్ కారుపై దాడి, గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
PM Modi Tirupati Tour: ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
ప్రధాని మోదీ 3 రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు.. అమిత్ షా, అజిత్ దోవల్ సైతం
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
KTR: తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
తుఫాను తీరం తాకినట్లు, కరీంనగర్ నుంచి కేసీఆర్ భూకంపం పుట్టించిన రోజు: దీక్షా దివస్‌లో కేటీఆర్
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget