Telangana Politics : అన్ని పార్టీల సీనియర్ల దృష్టి అసెంబ్లీపైనే - ఢిల్లీ ఆలోచనే చేయని తెలంగాణ సీనియర్లు !
అన్ని పార్టీల సీనియర్ నేతలది లోకల్ చూపే !ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సన్నాహాలు!ఎంపీలందరూ దాదాపుగా ఎమ్మెల్యే బరిలోకి ! జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్‌లోనూ ఎమ్మెల్యే సీట్లకే డిమాండ్ !
BRs Politics : తెలంగాణ రాష్టర్ సమితి కాస్తా భారత రాష్ట్ర సమితి అయింది. ఆ పార్టీ నాయకులు అందరూ జాతీయ పార్టీ నాయకులు అయ్యారు. కానీ విచిత్రంగా లోకల్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారు.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వారు కూడా తమకు ఎమ్మెల్యే సీటే కావాలంటున్నారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్, బీజేపీల్లోనూ అదే పరిస్థితి ఉంది. అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు !
అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి తో సహా రాష్ట్రంలోని ఆయా లోక్‌సభ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న ముఖ్య నేతలు ఈ దఫా అసెంబ్లీ బరిలో నిలిచేం దుకు రంగం సిద్ధం చేసుకుంటు-న్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా శాసన సభకు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షిం చుకునేందుకు సిద్ధమ్యారు. ఎంపీలుగా కొనసాగుతున్న ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు క్యాడర్‌కు చెప్పుకుని సన్నాహాలు చేసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ-లో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో తరచూ పర్యటిస్తూ అక్కడి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని వారికి కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీని అన్ని రాష్ట్రాల్లో భారీగా విస్తరించేం దుకు ప్రణాళికలు రూపొందిస్తోన్న కేసీఆర్ ఆంగ్ల, హిందీ భాషల్లో బాగా పట్టు-న్న వారిని ఎంపీ అభ్యర్థు లుగా నిలబెట్టి వారి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నరాు. కానీ వారు మాత్రం ఎమ్మెల్యే సీటు చాలంటున్నరు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లది లోకల్ రాజకీయమే !
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓడిపోకపోతే మల్కాజిగిరి నుంచి పోటీ చేసే వారే కాదు. ఎంపీ అయ్యే వారే కాదు. అయినప్పటికీ ఈ మరోసారి కొడంగల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడయ్యారు. బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వేములవాడ అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్‌నగర్ బరిలో నిలవనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశంతో నల్గొండ ఎంపీ బరిలో నిలిచి విజయం సాధించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేములవాడ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్‌లో కొంత మంది ఎమ్మెల్యేలకు ఎంపీ యోగం !
నాగర్‌కర్నూలు ఎంపీగా ఉన్న మాజీ మంత్రి పోతుగంటి రాములు అచ్చంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని నాగర్ కర్నూలు లోక్‌సభకు పోటీకి పెట్టే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్య ర్థిగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. దాసోజు శ్రవణ్ కు హిందీ, ఇంగ్లిష్‌లలో పట్టు ఉండటంతో జాతీయ రాజకీయాల్లో అవసరం అని ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీరి మొదటి చాయిస్ ఎమ్మెల్యేనే. కేసీఆర్ ఆదేశిస్తే.. ధిక్కరించే అవకాశం వీరికి ఉండదు.