అన్వేషించండి

Congress North vs South Strategy: రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?

Delimitation 2026 Hybrid Model: డీలిమిటేషన్, నిధులపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన దక్షిణాది వాదం జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఉత్తదారిన ఏం చెబుతుంది?

Telangana CM National Politics:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ వేదికలపై  దక్షిణాది ఆత్మగౌరవ వాదాన్ని అత్యంత అగ్రెసివ్‌గా వినిపిస్తూ దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు. ముఖ్యంగా ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన  , కేంద్రం నుంచి వచ్చే నిధులు ,  పన్నుల పంపిణీలో జరుగుతున్న అసమానతలపై ఆయన ఎక్కుపెట్టిన విమర్శలు జాతీయస్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి.  మేము కేవలం పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సలాం కొట్టే ద్వితీయ శ్రేణి పౌరులం కాబోం  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదన మాత్రమే కాదు.. ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ పార్టీ సీఎం  ప్రాంతీయ సెంటిమెంట్ 

ఒక జాతీయ పార్టీ  తరఫున ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్‌ను, ముఖ్యంగా ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వాదాన్ని లేవనెత్తడం వెనుక కాంగ్రెస్ పార్టీ మారుతున్న అంతర్గత రాజకీయ సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని ఎన్నికల సరళిని పరిశీలిస్తే, ఉత్తరాది రాష్ట్రాలలో   కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోతోంది. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు కాంగ్రెస్‌కు ప్రధాన ఆర్థిక, రాజకీయ వనరులుగా మారాయి.  ఉత్తరాదిపై ఆశలు వదులుకోకపోయినా, తమకు పెట్టని కోటగా మారిన దక్షిణాదిని మరింత పటిష్టం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే రేవంత్ రెడ్డి చేత కాంగ్రెస్ అధిష్ఠానం ఈ తరహా వాయిస్ వినిపిస్తోందని భావించవచ్చు.

రేవంత్ రాజకీయంతో కాంగ్రెస్‌కు దక్షిణాదిన మేలు

ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన పిల్లర్  గా రూపాంతరం చెందుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతాయని రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వంటి ఇతర దక్షిణాది నేతలకు లేఖలు రాస్తూ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేయడం ద్వారా ప్రాంతీయ పార్టీల కంటే తానే ఈ వాదాన్ని బలంగా మోయగలనని నిరూపించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' అంటే 50% సీట్లను జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం ఆధారంగా కేటాయించాలనే డిమాండ్ — ఆయన పొలిటికల్ మెచ్యూరిటీని చూపిస్తోంది. దీనివల్ల ఆయన కేవలం గుడ్డిగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదని, ఒక నిర్మాణాత్మకమైన ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది అటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇమేజ్‌ను దెబ్బతీయకుండా, ఇటు దక్షిణాది ప్రయోజనాలను కాపాడే సమతుల్య వ్యూహంగా ఉపయోగపడుతోంది.

మరింత పెరగనున్న దక్షిణాది సెంటిమెంట్ 

భవిష్యత్ రాజకీయాల కోణంలో చూస్తే, ఈ 'దక్షిణాది సెంటిమెంట్' రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఢిల్లీ పాలకుల నిర్ణయాల వల్ల దక్షిణాది రాజకీయంగా అణగారిపోతుందనే భయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయవచ్చు.  అయితే, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఈ వ్యూహం రెండు అంచుల కత్తి లాంటిదే. దక్షిణాదిలో ఈ వాదం మైలేజ్ ఇచ్చినప్పటికీ, ఉత్తరాది రాష్ట్రాలలో దీనివల్ల కాంగ్రెస్ మరింత రక్షణలో పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది హక్కుల కోసం పోరాడే ఒక 'ఫైర్ బ్రాండ్' లీడర్‌గా రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget