అన్వేషించండి

PV Sunil Kumar IPS Challenges Raghurama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు పోటీగా పీవీ సునీల్ కుమార్ - నెలాఖరులో రిటైర్ అవగానే ఇక రాజకీయమే ?

PV Sunil Kumar Political Entry YSRCP: సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌ కొత్త మార్గంలోకి వెళ్తోంది.

IPS Sunil Kumar vs RRR Political Controversy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  హయాంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును   లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐపీఎస్ అధికారి అన్న హోదాను పక్కనబెట్టి సునీల్ కుమార్ విసురుతున్న రాజకీయ సవాళ్లు, దానికి రఘురామ ఇస్తున్న కౌంటర్లతో ఇరుపక్షాల మధ్య డైలాగ్ వార్  పీక్స్‌కు చేరింది. మీ 

రాజీనామా సవాళ్ల వెనుక అసలు స్ట్రాటజీ 

గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆ తర్వాత జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవీ సునీల్ కుమార్.. ఇటీవల కాలంలో పూర్తిగా ఒక పొలిటికల్ లీడర్ అవతారమెత్తారు. రఘురామ గనుక తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వస్తే.. ఆయనపై తాను పోటీ చేసి వేయి ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని సునీల్ కుమార్ విసిరిన సవాల్ తీవ్ర దుమారం రేపింది. అయితే రఘురామ ఇప్పుడు రాజీనామా చేయరని, ఒకవేళ చేసినా సునీల్ కుమార్ నేరుగా వచ్చి పోటీ చేయరని అందరికీ తెలిసిన సత్యమే. కానీ, రఘురామకృష్ణరాజు అనే ఒక పెద్ద లీడర్‌ను  బూచి గా చూపిస్తూ.. ఆ వివాదం ద్వారా తన పొలిటికల్ ఇమేజ్‌ను పెంచుకోవడమే సునీల్ కుమార్ అసలు వ్యూహమని  భావిస్తున్నారు.

నెలాఖరులో పీవీ సునీల్ రిటైర్మెంట్

ఈ వివాదంలో అత్యంత విచిత్రమైన, చట్టపరమైన తిరకాసు ఏమిటంటే.. పీవీ సునీల్ కుమార్ ఇంకా అధికారికంగా పోలీస్ సర్వీస్‌లోనే ఉన్నారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ అఖిల భారత సర్వీస్ నిబంధనల  ప్రకారం ఒక ఐపీఎస్ అధికారి ఇలా ప్రత్యక్ష రాజకీయ సవాళ్లు విసరడం, ప్రెస్ మీట్లు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. అయితే, తాను సర్వీస్‌లో ఉన్నాననే విషయాన్ని కూడా పక్కనబెట్టి, నేరుగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామతో రాజకీయ సవాళ్లు చేస్తున్నారు. భీమవరం వేదికగా జరిగిన దళిత సామాజికవర్గాల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే.. త్వరలోనే రిటైర్ అయిన తర్వాత నేరుగా వైఎస్ఆర్‌సీపీలో చేరి రఘురామపై పోరాడతాననే బలమైన సంకేతాలను ఇస్తున్నారు.

 అట్రాసిటీ అస్త్రం - దళిత సెంటిమెంట్ రాజకీయం 

ఈ రాజకీయ వివాదానికి పీవీ సునీల్ కుమార్ దళిత సెంటిమెంట్‌ను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశాన్ని జోడించడం ద్వారా మైలేజ్ సాధించాలని చూస్తున్నారు. దళితుల రక్షణ కోసమే తాను నిలబడ్డానని, తాను సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు దాదాపు 4,000 ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఛార్జ్‌షీట్లు వేయించానని సునీల్ కుమార్ ప్రకటించుకున్నారు. రఘురామతో ఉన్న పాత గొడవను కేవలం వ్యక్తిగత కక్షగా కాకుండా.. దానిని దళిత వర్గాల ఆత్మగౌరవ పోరాటంగా మార్చడం ద్వారా వైఎస్ఆర్‌సీపీలో ఒక కీలకమైన దళిత ఫేస్  గా ప్రొజెక్ట్ అవ్వాలనేది ఆయన స్కెచ్. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భీమవరంలో జరిగింది మత సభ లేదా సామాజిక సభ కాదని, అది పక్కా  వైసీపీ పార్టీ సభ అని రఘురామ ఎద్దేవా చేశారు. అసలు ఒక ఐపీఎస్ అధికారి 4,000 ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఛార్జ్‌షీట్లు ఎలా వేయిస్తారని, అది కోర్టులు , దర్యాప్తు అధికారుల పరిధిలోని అంశమని గుర్తుచేశారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సునీల్ కుమార్‌పై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 వైసీపీలో ప్లేస్ కోసమే ఈ హైడ్రామానా? 

రఘురామకృష్ణరాజు ఇటీవల రామాలయంతో పాటు చర్చి విషయంలోనూ వివాదాస్పదం అయ్యారు. ఆయనకు కౌంటర్ ఇచ్చే గట్టి నాయకుడి కోసం జగన్ చూస్తున్నారు.  సరిగ్గా ఈ తరుణంలో కూటమిలో అత్యంత కీలకమైన రఘురామకృష్ణరాజును టార్గెట్ చేయడం ద్వారా జగన్ దృష్టిలో పడాలనేది సునీల్ కుమార్ ప్లాన్. కూటమి ప్రభుత్వంపై ఎంత గట్టిగా పోరాడితే.. వైసీపీలో అంతటి ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనతోనే, రఘురామతో ఉన్న వివాదాన్ని తన భవిష్యత్తు పొలిటికల్ కెరీర్‌కు పెట్టుబడిగా మార్చుకోవడానికి సునీల్ కుమార్ సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  రాజకీయాల్లో ఒక పెద్ద లీడర్‌ను ఢీకొట్టడం ద్వారా రాత్రికి రాత్రే పాపులారిటీ తెచ్చుకోవాలనే పాత ఫార్ములాను పీవీ సునీల్ కుమార్ వాడుకుంటున్నారు. అయితే, ఖాకీ చొక్కా విప్పకముందే ఇలాంటి బహిరంగ రాజకీయ సవాళ్లు విసరడం ఆయన చుట్టూ మరిన్ని చట్టపరమైన చిక్కులను తెచ్చిపెట్టేలా ఉంది. మరి రఘురామకృష్ణరాజును బూచిగా చూపిస్తూ సునీల్ కుమార్ వేసుకుంటున్న ఈ పొలిటికల్ రూట్‌మ్యాప్ ఆయనను వైఎస్ఆర్‌సీపీలో ఏ స్థాయికి తీసుకెళ్తుందో  వేచి చూడాలి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget