అన్వేషించండి

PM Modi : పద్దతి లేకుండా విభజించడం వల్లే తెలుగు రాష్ట్రాలకు కష్టాలు - రాజ్యసభలో మోదీ కీలక వ్యాఖ్యలు !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విభజించకపోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విభజన చేయని కారణంగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సమస్యలు వచ్చాయని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చిన ప్రధాని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వైఫల్యాల ప్రస్తావలో ఏపీ విభజనపై కూడా మాట్లాడారు.  మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారని.. పార్లమెంటులో కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారని గుర్తు చేశారు. 

తెలంగాణలో థర్డ్ వేవ్ ముగిసినట్లే, WFHలు అక్కర్లేదు.. కీలక వివరాలు చెప్పిన డీహెచ్

కాంగ్రెస్ పార్టీ విభజన జరిపిన తీరుతోనే ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని.. శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సోమవారం లోక్‌సభలో కూడా ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ కాంగ్రెస్‌ను బహిష్కరించారన్నారు.

మేం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చాం.. ‘జగనన్న చేదోడు’ నిధుల విడుదల సందర్భంగా సీఎం వెల్లడి

రాజ్యసభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావించాల్సి వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల విభజన గురించి కూడా ప్రస్తావిస్తారు. అయితే విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా కీలకంగా వ్యవహరించారు. విభజనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లు రూపకల్పనలో అప్పటి బీజేపీ ముఖ్య నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు. బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మరీ బిల్లును ఆమోదించారన్న విమర్శలు ఉన్నాయి. ఆమోదించిన విధానాన్ని బీజేపీ అప్పట్లో వ్యతిరేకించలేదు. 

అయితే విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని మోదీ కార్నర్ చేసిన ప్రతీ సారి ఆయన  తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు వచ్చేవి. ఈ సారి కూడా అలాగే వచ్చే ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీపై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ నేతలు కూడా స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలుMS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Airtel Not Working: డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
డౌన్ అయిన ఎయిర్‌టెల్ - యూజర్లకు చుక్కలు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Embed widget