By: ABP Desam | Updated at : 08 Feb 2022 01:16 PM (IST)
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కోసం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయీబ్రాహ్మణు, దర్జీల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ సంక్షేమ పథకం కింద 2,85,350 మంది బ్యాంకు అకౌంట్లలో రూ.285.35 కోట్లను జమ చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లకు చేరింది.
‘‘ఏపీలో టైలరింగ్ షాపులు నిర్వహిస్తున్న 1,46,103 మంది దర్జీలకు రూ. 146.10 కోట్లు అందుతున్నాయి. ఇస్త్రీ, లాండ్రీ షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు అందిస్తున్నాం. దుకాణాలు ఉన్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నాం. లంచాలు, వివక్షతకు వీల్లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నాం. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ పథకం కింద సాయం అందజేస్తున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 1.84 లక్షల పర్మినెంటు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చామని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని తెలిపారు. 58 శాతం నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని సీఎం అన్నారు. 51 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని సీఎం జగన్ తెలిపారు.
మరోవైపు, ఉద్యోగుల సమ్మె గురించి కూడా సీఎం జగన్ స్పందించారు. ఉద్యోగులు సీఎంను తిడుతుంటే చంద్రబాబు అనుకూల మీడియా పండగ చేసుకుంటోందని విమర్శించారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి సంధి జరిగి.. వారు సమ్మెకు వెళ్లకపోవడంతో వారికి మంట కలుగుతోందని అన్నారు.
Pawan Kalyan : ఇద్దరు ఎంపీలతో మొదలై కేంద్రంలో అధికారం, జనసేన ప్రస్థానం కూడా అంతే - పవన్ కల్యాణ్
Vidadala Rajini : కొలకలూరులో ప్రబలిన డయేరియా, బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని
Modi Tour In AP: ఏపీలో మోదీ టూర్లో కఠిన ఆంక్షలు- వచ్చిన వారందరికీ కరోనా టెస్టులు
AP Corona Cases : ఏపీలో కరోనా కలవరం, వరుసగా ప్రజాప్రతినిధులకు పాజిటివ్
Vangaveeti Nadendal Meet : వంగవీటి ఇంటికి నాదెండ్ల మనోహర్ ! కారణం ఏమిటంటే ?
IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌పై బుమ్రా బాంబ్ - పట్టుబిగిస్తున్న భారత్!
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Bandi Sanjay On KCR: దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి చూపించు- కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్