అన్వేషించండి

PK Fail : కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనాలను అందుకోని ప్రశాంత్ కిషోర్ పీకేతో కేసిఆర్ కు చెడింది అక్కడే..!

కేసీఆర్ జాతీయ రాజకీయాల అంచనలాను ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు అందుకోలేకపోయాయి. తెలంగాణ వరకైతే తన వ్యూహాలు చాలనుకుని ఐ ప్యాక్‌ సేవలను కేసీఆర్ చాలించినట్లుగా తెలుస్తోంది.

 

 

PK Fail :  పికే అలియాస్‌ ప్రశాంత్‌ కిశోర్‌. ఈపేరు తెలియని రాజకీయనేతలు, పార్టీనే కాదు సామాన్యులు కూడా ఉండరు. ఆయన సర్వే చేస్తే గెలుపుతో పాటు అధికారం కూడా పక్కా అన్న విషయం రాజకీయపార్టీలు, నేతలకు తెలుసు. అందుకే పీకేతో అదేనండి ప్రశాంత్‌ కిశోర్‌ తో పనిచేయడానికి రాజకీయనేతలు, పార్టీలు ఉత్సాహంగా ఉంటాయి. ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానిగా మారడం వెనక పీకె హస్తం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ! ఇప్పుడేమైంది అంటే తెలంగాణ నుంచి పీకేని పీకేశారని వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఇది అంత ఇంపార్టెంట్‌ ఇష్యూని అంటే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వార్త సెన్సేషన్‌ అవుతోంది. నిజంగా ప్రశాంత్‌ కిశోర్‌ తెలంగాణ  నుంచి తప్పుకున్నారా అంటే అవుననే చెబుతున్నారు పీకే టీం సభ్యులు. 

బెస్ట్ ఫ్రెండ్ పీకే సర్వేలను పెద్దగా నమ్మని కేసీఆర్ ! 
 
తెలంగాణ సిఎం కెసిఆర్ ఎప్పుడూ సర్వేలు, ఇంటలిజెన్స్‌ రిపోర్ట్‌ లను బాగా నమ్ముతారు. ఆయన ఓ రకంగా అధికారంలోకి రావడానికి కీలకం ఇవే అన్నది బహిరంగ రహస్యమే. ఈసారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారబోతోంది. వరసగా రెండుసార్లు అధికాంరలో ఉన్న టీఆర్‌ ఎస్‌ కి ఈసారి బీజేపీ బలమైన పోటీ ఇవ్వబోతోంది. అంతేకాదు అధికారపార్టీ తీరుపై ప్రజల్లోనూ అసంతృప్తి ఉందన్న వార్తల నేపథ్యంలో కెసిఆర్‌ సర్వేల్లో సిద్ధహస్తుడైన ప్రశాంత్‌ కిశోర్‌ ని రంగంలోకి దింపింది. అంతేకాదు అధికారికంగా కూడా పీకే నా బెస్ట్‌  ఫ్రెండ్‌  అంటూ కెసిఆర్‌ చెప్పడంతో పీకే సర్వేలు నిజమన్న వార్తలు బలపడ్డాయి. ఎనిమిదేళ్ల పాలనపై పీకే టీం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీంట్లో చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరో సారి సర్వే చేసినా అందులో అదే వచ్చిందంట. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక రావడంతో పీకే టీమ్‌ తన స్టైల్లో పని మొదలు పెట్టింది. కెసిఆర్‌ కి  ఏటుజెడ్‌ రిపోర్ట్‌ ని గ్రౌండ్‌ లెవల్లో అందించింది. జిల్లాలో పార్టీ బలం, నేతల ప్లస్‌-మైనస్‌ , పథకాలు ఇలా ఒకటేమిటీ అధికారపార్టీ లోపాలన్నింటిని కెసిఆర్‌ కి ఆధారాలతో సహా రిపోర్ట్‌ లను అందించిందట. దీనిపై నేతల్లో అసంతృప్తి రావడంతో కెసిఆర్‌ ఆలోచనలో పడ్డారట. అదీ కాకుండా ఎప్పుడైతే పీకే టీమ్‌ తెలంగానలో సర్వే మొదలెట్టింది అన్న వార్త వైరల్‌ అయ్యిందో అప్పుడే వివిధ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అప్పుడు అంతగా పట్టించుకోని కెసిఆర్‌ ఇప్పుడు సొంత నేతల నుంచే అసహనం వ్యక్తం కావడంతో పీకేని దూరం పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే పీకే టీమ్‌ హైదరాబాద్‌ లో ఐ-పాక్‌ ఆఫీసుని ఏర్పాటు చేసి భారీగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకుంది. ఈ తరుణంలో పీకే టీమ్‌ తెలంగాణలో సర్వేని నిలిపివేసి తట్టా బుట్టా సద్దేసిందన్న టాక్‌ వినిపిస్తోంది. 

జాతీయ రాజకీయాలే పీకేను దూరం పెట్టాయా? 

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన కేసిఆర్ - పీకే సహాయాన్ని కోరారు. అందుకోసం రోజుల తరబడి ప్రగతి భవన్ లో కూర్చొని రూట్ మ్యాప్ తయారు చేశారు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా తయారైంది. కేసిఆర్ ను జాతీయరాజకీయాల్లో బాగా ఎక్స్ పోజ్ చేసే స్ట్రార్టజీలో పీకే పూర్తిగా ఫెయిల్ అయ్యారని కేసిఆర్ భావించినట్లున్నారు. కేసిఆర్ తో భేటి అయిన ప్రతి నాయకుడు కాంగ్రెస్ గడప తొక్కడ గులాబీ బాస్ కు కొంత కోపాన్ని తెచ్చిపెడుతోంది. నితీష్, లాలూలను తన వర్గంలోనే ఉండేలా రాయభారం చేయమని పీకే కు టాస్క్ ఇచ్చారంట. అది కాస్తా బెడిసి కొట్టింది. తాజాగా నితీష్ అండ్ టీం సోనియాతో భేటి కావడం ఇంకొంచెం గరం తెప్పించింది. మరోవైపు నితిష్, లలూ, శరద్ పవార్, లెఫ్ట్ పార్టీలు, జెడిఎస్ తో పాటు మరొకొన్ని పార్టీలు కాంగ్రెస్ లేకుండా అనే రాగం పాడుతున్నారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ కు పీకే చేసే హెల్ప్ కూడా ఏమీ లేదనీ, ఇదే విషయాన్ని కేసిఆర్ కు చెప్పినట్లు తెలిసింది. ఇక తెలంగాణ వరకు కేసిఆర్ కు సర్వేలు అవసరంలేదు. ఆయన సొంత ఇంటిలిజెన్స్, సొంత టీంలతో ఆయన ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఇక పీకే టీం అవసరం నేషనల్ లెవల్లోనే కావాలి. కానీ నేషనల్ పాలిటిక్స్ లో కేసిఆర్ కు తాను అంతగా ఉపయోగపడనని పీకే భావించాడో, లేక కేసిఆర్ నే పీకే ఏం అవదని డిసైడ్ అయ్యారో లేదో తెలియదు కానీ పీకే ను దుకాణం బంద్ చేయమని చెప్పారంట.  

జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయిన పీకే స్ట్రాటజీలు

రాజకీయాల్లోనే రంగులు మారుతా ఉంటాయి. ఎప్పుడు ఎవరు జట్టు కడతారో తెలియదు. ఇప్పుడు  పీకే కూడా ఎప్పుడు ఎవరికి ఎలా పనిచేస్తాడో తెలియద అన్నట్లు తయారైంది. బీహార్ లో ఊహించని పొత్తుల రాజకీయాలు పీకేను సైతం విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా జట్టు సాధ్యం కాదని తేల్చిచెప్పారు నితీష్, లలూ ప్రసాద్ యాదవ్. సో పీకే కూడా ఈ టీంలోకే వస్తారా? లేక ఆయన సొంత ఎజెండాతోనే ముందుకెళ్తారాని రాబయో రోజుల్లో తెలనుంది. మొత్తం మీద పీకే టీం తెలంగాణనుంచి వెళ్లిపోవడం కొంతమంది గులాబీనేతలు ఊపిరి పీల్చుకున్నారంట. సర్వేలు అంటూ తమ అధినాయకుడి ఏం రిపోర్ట్ పెడతారోనని తెగ భయపడినేతలు ఉన్నారు. సో పీకే బాల్ తెలంగాణ నుంచి ఎగిరిపోయింది. 

వ్యక్తిగత రాజకీయ వ్యూహాల్లో పీకే ! 

తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్‌ రాజకీయాల్లోనూ పీకే  బిజీగా ఉన్నారు. బీహార్ లో చక్రం తిప్పాలనకుంటున్న పీకే ఈ సర్వేల యాపారంతో అంత వర్క్ అవుట్ అది అనుకున్నారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ మీద కాన్సస్ట్రేషన్ చేశారు. అక్టోబర్‌ 2 నుంచి పాదయాత్రని కూడా ప్రశాంత్‌ కిశోర్‌ మొదలుపెట్టనున్నారు. దీంతో ఆయన టీమే  స్ట్రాటజిస్ట్ వ్యవహారాలు చూస్తోంది. వారు .. క్లయింట్ల అంచనాలను అందుకోలేకపోతున్నారని అనుకోవచ్చు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget