అన్వేషించండి

Telugu State Politics : తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రాజకీయ చదరంగం ! కీలక మార్పులకు "భేటీలు" గ్రౌండ్ ప్రిపేర్ చేసేశాయా ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రెండు రోజులుగా కీలక మలుపులు తిరుగుతున్నాయి. అవి ఏ తీరానికి చేరనున్నాయి ?

Telugu State Politics :  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉన్నా .. రోజు రోజుకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఏపీలో పొత్తుల చర్చలు.. రాజకీయ విమర్శలు... వరుస భేటీలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటు తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయంలో కొత్తగా సీబీఐ కేసులూ వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఎప్పుడైనా కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్నంత వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. 

ఏపీలో రాజకీయాల్లో భేటీల కలకలం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత మూడేళ్ల నుంచి వేడి మీదనే ఉన్నాయి. అయితే ఎక్కువగా అధికార పార్టీ..  ప్రతిపక్ష పార్టీని వేటాడటమే ఉంది. భారీగా దెబ్బతిన్న టీడీపీ.. ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఇవ్వకుండా కేసులు..విచారణలతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ మధ్యలో కరోనా సీజన్లు రావడంతో టీడీపీ కూడా ఆన్ లైన్ రాజకీయాలు చేసింది. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉందనగా ఒక్క సారిగా రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబునాయుడు బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు గతంలోలా చంద్రబాబు విషయంలో ఘాటుగా స్పందించడం లేదు. కానీ..  ఇంత వరకూ సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. యువ సంఘర్షణ ర్యాలీ ముగింపుసభకు హాజరైన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ .. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ఆర్‌సీపీలోనూ ఈ పరిణామం చర్చనీయాంశమయింది. 

రాత్రి అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ ! ఉదయం ప్రధానితో జగన్ భేటీ !

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. కేవలం అభినందన విందు అని బీజేపీ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుకుంటున్నారు. అది డైరక్ట్ రాజకీయమా.. ఇన్‌డైరక్ట్ రాజకీయమా అన్నదానిపై స్పష్టత లేదు. పైగా తెలంగాణ రాజకీయాలను గురి పెట్టారన్న దానిపై జరుగుతున్న ప్రచారం కన్నా..   బీజేపీ ఏపీని గురిపెట్టి వ్యవహారాలను నడుపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎన్టీఆర్ ప్రభావం తెలంగాణలో కన్నా ఏపీలోనే ఎక్కువ. వీరి భేటీ కన్ఫర్మ్ అయిన తర్వాత అమరావతి నుంచి జగన్ ఢిల్లీ టూర్‌కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. సీఎం జగన్అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారని..సోమవారం ఉదయమే ప్రధానితో భేటీ అవుతారని ఆ ప్రకటన సారాంశం. అన్నట్లుగా జగన్ ఢిల్లీ వెళ్లారు.  ప్రధానితో అరగంట సేపు మాట్లాడారు. కానీ ఎజెండా  ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు. అయితే రాష్ట్రం కోసం అని.. ఎప్పుడూ చెప్పే అంశాలతోనే ఓ వినతిపత్రం మోదీకి ఇచ్చారన్న సమాచారం మీడియాకు వచ్చింది. కానీ ఈ భేటీలో అంతకు మించి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నాయా ?

ఏపీలో పొత్తుల రాజకీయాలు అంతర్గతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం  బలంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని జనసేన పార్టీ  ప్రకటిస్తోంది.  తమ రాజకీయ తీర్మానంలో ఆ విషయాన్ని అధికారంగా ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ ముక్త ఏపీ అని జనసేన నినాదం. ఇక ఆ పార్టీ ఓట్లు చీల్చబోమంటూ ప్రతిజ్ఞలు అలా చేయాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీకి దగ్గరతువుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్ఆర్‌సీపీకి కూడా క్లారిటీ ఉందేమో కానీ..టీడీపీతో మళ్లీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వారిష్టమని.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ట్వీట్ చేశారు.  మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన దశ నడుస్తోంది. ఇది ఏ మలుపు తిరగబోతోందో  చెప్పడం కష్టం. కాలమే డిసైడ్ చేయాలి. 

లిక్కర్ స్కాం చుట్టూ తెలంగాణ రాజకీయాలు ! 

తెలంగాణలోనూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం మొత్తం కేసీఆర్ కుమార్తె కవిత కనుసన్నల్లో జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి లోకల్‌గా చేసిన ఆరోపణలు అయితే రాజకీయం అయ్యేవి. కానీ ఢిల్లీలో ఈ  స్కాం గుట్టుముట్లు ఉన్నాయి. అక్కడి నేతలే కేసీఆర్ కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రేనని.. కేసీఆర్‌ ను నియంత్రించడానికి తనను టార్గెట్ చేస్తున్నారని కవిత అంటున్నారు. అయితే టీఆర్ఎస్ అనుకున్నంత తేలిగ్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లేదు. బీజేపీ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే ఏదో తీగ దొరికిందన్న అనుమానం తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ ఉంది. పైగా ఈ కేసులు ఈడీ చేతికి వెళ్లబోతున్నాయి. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు జరిగితే ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఈడీ వచ్చినా బోడీ వచ్చినా.. భయపడేదే లేదని టీఆర్ఎస్ అధినేత చెబుతున్నారు కానీ.. ఇప్పుడా పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ ఈ లిక్కర్ స్కాం అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకే ప్రయత్నిస్తోందని.. లేకపోతే.. సీబీఐ ద్వారానే అసలు విషయం చెప్పించేవారు కదా.. తమెందుకు  ఆరోపణలు చేస్తున్నారన్న సందేహం వస్తోంది. అందుకే ఈ కేసు తెలంగాణ రాజకీయాలను ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 

కాంగ్రెస్‌లో అదే కుంపటి..  తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం!

తెలంగాణ కాంగ్రెస్‌లో అదే కుంపటి కనిపిస్తోంది. ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. మరోవైపు కేసీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు.. మౌనంగా ఉండకూడదని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమమంలో అందర్నీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఏదో పెద్ద ఉద్యమానికే ప్లాన్ చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. 

తెలుగు రాష్ట్రాల్లో ఏదో జరుగుతోంది. రాజకీయంగా కీలకమైన మార్పులకు వేదికలు రెడీ అవుతున్నాయి. కానీ అదేమిటో అన్నది మాత్రం క్లారిటీలేదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. కొద్ది రోజుల్లోనే తేలనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget