అన్వేషించండి

NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?

పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ ఏం చేశారు? ఆయన ఎలా ప్రచారం చేశారంటే ?

NTR centenary celebrations :  తెలుగు దేశం పార్టీ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో సంచలనం సృష్టించిన పార్టీ. ఎన్టీఆర్ గురించి ఎవరు చెప్పినా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చారని చెబుతారు. పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావడానికి 9 నెలల పాటు ఎన్టీఆర్ ఎలా శ్రమించారు ? పార్టీ అభ్యర్థుల్ని ఎలా ఖరారు చేశారు ? ప్రచారం ఎలా చేశారు?
NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?

ఎన్టీఆర్ పార్టీ ప్రకటన వార్త సంచలనం 

ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారనే వార్త ప్రకంపనలు స్పష్టించింది. జనాలు చర్చించుకుంటుండగానే 1982 మార్చి 29న పార్టీని  ప్రకటించారు తారకరామారావు. పార్టీ ప్రకటించి ఆయన ఏం చేయాలా అని ఆలోచించలేదు. ప్రజల్లోకి వెళ్లిపోయారు.  ఎన్టీఆర్  చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలిపోయాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జనసందోహమే. ఇసుక వేస్తే రాలనంతా జనమే. గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా  కదలిరా  స్టిక్కర్లే. వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు.
NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?

నిజాం కాలేజీ మైదానంలో తొలి సభ 

ఎన్టీఆర్ సమ్మోహన శక్తికి తోడు  కాం[గెస్‌ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాం(గెస్‌ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్షీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీనిర్మాణం ర్యాష్టస్టాయి నుండి గ్రామ స్పాయికి పాకింది. 1982 ఏప్రిల్‌ 11వ తేదీన నిజాం కాలేజీ (గ్రౌండ్స్‌లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ  మహానాడు విజయవంతంఅయింది. రామకృష్ణా స్తూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్‌ వీధులను దద్దరిల్లజేసింద!ి. ఆ సభలో ఎన్‌.టి.ఆర్‌. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒకగుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళిపోయిన పాత వ్యవస్తను కూకటి వేళ్ళతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నెరు. ఆయన మహెద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ ర్యాష్టంలో సంచలనం సృష్టించింది.
NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?
 
70 రోజులపాటు అవిశ్రాంతగా  రాష్ట్ర పర్యటన

జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా ర్మాషమంతటా పర్యటించారు. 35000 కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్హమయ్యే; ధోరణిలో వాళ్లహృదయాలకు హత్తుకునేలా చెప్పేవారు.   ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వం ఆయన కొనుగొలు చేసిన చెవర్‌లేట్‌ వ్యాన్‌ 1982 ఆగస్టులో 10,000 రూపాయలతో బాగుచేయించి ప్రచారానికి కావలసిన అన్ని సౌకర్యాలతో రెడీ చేయించారు.  అందులో ప్రచారానికి వెళ్ళే ముందు ఖాకీ దుస్తులు రెండు జతలు ,వెన్నె,తేనే, నిమ్మకాయల రసం, సోడా ఇవన్నీ వ్యాన్‌లో భద్రపరిచి వుంచేవారు. అవసరమున్నప్పుడల్తూ వాటిని ఉపయోగించేవారు.
NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?

పార్టీ పెట్టిన 9 పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ద్వారా చరిత్ర!

దారి పొడవునా పుష్పహారాలతో ,మంగళహరతులతో జయ జయ ద్వానాలతో నాదస్వరాలతో ఆహ్వానించారు. ఆయన కోసం దారి పాడగునా ఎప్పుడు వస్తాడో ,ఎప్పుడు కనబడుతాడో అనే ఆశతో గంటల తరబడి వాననక,ఎండనక,రాతశ్రీ పగలనక వేచి వుండేవారు. వెళ్ళిన ప్రతిచోట పార్టీ కార్యకర్తలకు తన ఉపన్యాసాలక్యాసెట్‌లను, పోస్టర్‌లను, వాళ్లు అనుసరించవలసిన కార్యక్రమాలకు కావలసినవి ఇచ్చి బయలు దేరేవారు. ఆవ్వ్యాన్‌ లోనే అల్యూమినియంతో తయారు చేసిన నిచ్రైన పైన కూర్చోవడానికి ఆసనం  1982 మే 27వ తేదీన ఎన్‌.టి.ఆర్‌. 60వ జన్మదిన వేడుకలు మహానాడు రూపంగా తిరుపతిలో జరిగాయి. పార్షీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు విజయవంతం అయ్యాయి. జన సముద్రాన్ని చూసి ఆయన ఉత్సాహం ఉత్తుంగ కెరటంలా ఎగిసిపడింది. తిరుపతి సభావేదికపై నుండే ఆయన ప్రత్యర్ది రాజకీయాలపైన సమరశంఖం ఊదారు. పార్టీ ప్రచార జైత్రయాత్రకు నాంది పలికారు.
NTR centenary celebrations : పార్టీ పెట్టడానికి - అధికారంలోకి రావడానికి మధ్య 9 నెలలు ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget