అన్వేషించండి

Lokesh : తప్పుడు ప్రచారం చేసే ఎవర్నీ వదిలి పెట్టం - ఇప్పుడే ప్రారంభమయిందన్న నారా లోకేష్ !

తప్పుడు ప్రచారం చేసే మీడియా సంస్థలను వదిలి పెట్టబోమని నారా లోకేష్ హెచ్చరించారు. తెలుగు, ఇంగ్లిష్ పత్రికలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టు ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తనపై వైఎస్ఆర్‌సీపీకి ( YSRCP ) చెందిన కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) విమర్శించారు. ఈ విషయంలో ఇక సహనంతో ఉండేది లేదని న్యాయపోరాటం ద్వారా తేల్చుకుంటానన్నారు. విశాఖ కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ తెలుగు, మరో ఇంగ్లిష్ దినపత్రికలపై లోకేష్ రూ.75 కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 

అరెస్ట్‌కు సన్నాహాలు - అయ్యన్న మాస్టర్ ప్లాన్ ! వెనక్కి పోలీసులు...

2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో  లోకేష్ ప్రజాధనం తో  రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో ( Vizag ) లేనని ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక క్షమాపణలు చెప్పింది కానీ తెలుగు, ఇంగ్లిష్ పత్రికలు పట్టించుకోలేదని.. కనీసం తన వివరణ కూడా ప్రచురించలేదన్నారు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నానన్నారు. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. 

సంపాదించకుండా ఖర్చు పెడితే దివాలానే - ఏపీనే సాక్ష్యమన్న బీజేపీ ! జగన్ పాలనపై తీవ్ర విమర్శలు

రాజకీయాల్లోకి రాక ముందు నుంచే  వ్యక్తిగత జీవితంపై కూడా  బురద జల్లారు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని లోకేష్ విమర్శించారు.    వేటికీ భయపడను..తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.  అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని కించపర్చేలా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేం మాట్లాడితే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. కానీ అది మా మా సంస్కృతి కాదు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశాను. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టననని లోకేష్ స్పష్టం చేశారు. 

పరువు నష్టం దావా విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ వచ్చారు. దీనిపై కౌంటర్ వేయడానికి ఇతర మీడియా సంస్థలు సమయం కావాలని అడిగాయి. ఇప్పటికే పలుమార్లు అలా అడగడంతో న్యాయమూర్తి ఎక్కువ సమయం ఇవ్వలేమని 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Jigra OTT: యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
యాక్షన్ అదరగొట్టిన ఆలియా భట్... బాలీవుడ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్- స్పష్టం చేసిన కేజ్రీవాల్
Embed widget