అన్వేషించండి

Nara Lokesh Delhi Tour Secrets : నారా లోకేష్ ఢిల్లీ మంత్రాంగం వెనుక రాజకీయం - పదే పదే అమిత్ షాతో ఏం చర్చిస్తున్నారు ?

TDP: నారా లోకేష్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్ పై టీడీపీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ అమలులో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Nara Lokesh  Delhi tour secrets are being hotly debated in TDP :  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్తుననారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో తరచూ సమావేశం అవుతున్నారు. మీడియాకు తెలిసే ఆయన నాలుగైదు సార్లు సమావేశం అయ్యారని.. మీడియాకు తెలియకుండా ఇంకా చాలా సార్లు చర్చలు జరిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదివారం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయమే చాలా మందికి తెలియదు. కానీ అమిత్ షాతో దాదాపుగా  గంటసేపు చర్చించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

అమిత్ షాతో పలుమార్లు భేటీ అయిన లోకేష్ 

నారా లోకేష్ అధికారక సమవేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. కానీ అధికారిక సమావేశాలు ఉన్నది సోమవారం.. ఆదివారం  ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సమావేశ ఎజెండా ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులేనని చెబుతున్నారు. కానీ అది పూర్తిగా రాజకీయ సమావేశం అన్న అభిప్రాయం కూడా ఉంది. చంద్రబాబునాయుడు పరిపాలన చూసుకుంటూంటే రాజకీయంగా నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ అమలు తన బాధ్యత అని నారా లోకేష్ చెబుతున్నారు. మద్యం స్కాంతో పాటు  గనుల స్కాంలు ఇతర అవకతవకల విషయంలో జరిగిన చర్యలు తీసుకునే విషయంలో లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. 

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు

రెడ్ బుక్ అమలును చట్టబద్దంగా చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నారు. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఏపీలో జరిగిన అవకతవకలు,స్కాములు,  మనీలాండరింగ్ వంటి అంశాలపై సాక్ష్యాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నరని చెబుతున్నారు. వారి నుంచి వచ్చే సూచనల ఆధారంగానే చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీలో మద్యం స్కాం అన్నింటికన్నా భారీగా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించారు. అంతర్గతంగా విచారణ జరుగుతోంది. డబ్బులు ఎక్కడి నుంచి ఎవరికి చేరాయి.. ఎలా మనీలాండరింగ్ జరిగింది అన్న వివరాలను కూడా సీఐడీ కనిపెట్టిందని.. ఒకే సారి ఈడీని కూడా రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. 

Also Read: Pawan Kalyan in Gurla: ఐదేళ్లు పంచాయతీ నిధుల దుర్వినియోగం వల్లే గర్ల ఘటనలు - బాధిత కుటుంబాలకు పవన్ వ్యక్తిగత సాయం ! 

ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమన్వయం అంశంపైనా చర్చ ? 

ఈ వ్యవహారాలతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు వంటి వాటిపైనా బీజేపీ పెద్దలతో నారా లోకేషే మాట్లాడుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిధులు.. జాతీయ రాజకీయాల అంశాలను చంద్రబాబు చూసుకంటూ ఉంటే.. పూర్తిగా రాష్ట్ర రాజకీయ అంశాలను నారా లోకేష్ టేకోవర్ చేశారని చెబుతున్నారు. ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండేందుకు స్వయంగా కొన్ని ముఖ్యమైన అంశాలను బీజేప పెద్దలకు చెబుతున్నట్లగా తెలుస్తోంది. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు నారా లోకేష్ ఢిల్లీలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే నారా లోకేష్ అందరికీ బాగా పరిచయమున్న నేత అయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget