అన్వేషించండి

Pawan Kalyan in Gurla: ఐదేళ్లు పంచాయతీ నిధుల దుర్వినియోగం వల్లే గర్ల ఘటనలు - బాధిత కుటుంబాలకు పవన్ వ్యక్తిగత సాయం !

Vizianagaram : అతిసారం ప్రబలి ప్రజలు అనారగ్యానికి గురైన విజయనగరంలోని గుర్ల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం ప్రకటించారు.

Pawan Kalyan inspected Diarrhea affected Gurla village in Vizianagaram district : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను స్వయంగా గుర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడి ఓవర్ హెడ్ ట్యాంకులను నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. తర్వాత బాధిత కుటుంబాలను పరామరశించారు. మృతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా రూ. లక్ష సాయం అందచేస్తానని  ప్రకటించారు. 

గుర్ల మండలంలో అతిసారం ఎలా ప్రబలిందన్న అంశంపై విచారణ చేయించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. నివేదికరాగానే తగిన చర్యలతో పాటు బాధితుల్ని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటామన్నారు. 

అధికారులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలతోనూ  మాట్లాడారు. .  దీంతో డిప్యూటీ సీఎం దృష్టికి గ్రామ‌స్థులు మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రం చేయ‌డంలేద‌ని గ్రామ‌స్థులు తెలిపారు. అలాగే ఒకే ఒక్క ట్యాంకు ఉండ‌డం వ‌ల్ల తాగునీటి స‌మ‌స్య వ‌స్తోంద‌న్నారు. ఐదేళ్ల పాటు పంచాయతీలకు వచ్చిన నిదుల్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని .. నిధులన్నింటినీ మళ్లించేయడంతో కనీసం పైపుల్ని బాగు చేయడానికి కూడా పంచాయతీల వద్ద నిధులు లేకుండా పోయాయని పవన్  కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు జరిగిన ఈ నిర్లక్ష్యాన్ని సరి చేస్తున్నామన్నారు. సమస్యలన్నీ పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.   

మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదన్నారు. ఫిల్టర్ బెడ్స్ మార్పు  చేసి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేది. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన పనిచేయవచ్చు కదా, అధికారులు గతంలో నిధులు రాలేదు అంటున్నారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలో మరో దాదాపు 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయి. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget