Ayyanna Police : సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసు - అయ్యన్న ఇంటికి పోలీసులు ! ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి నల్లజర్ల పోలీసులు వెళ్లారు.సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో నోటీసులు ఇవ్వడానికే వెళ్లామని పోలీసులు చెబుతున్నారు. అయితే పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లడంతో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ( CM Jagan ) దూషించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ( Ayyanna Patrudu ) ఇంటికి వచ్చారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ లు కొంత మంది సిబ్బందితో  రావడంతో  అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాము  41(A) నోటీసు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వచ్చిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఏ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ అవినాష్, దేవరాపల్లి ఎస్ఐ కె శ్రీ హరి రావు ఉన్నారు.గత వారం నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ( NTR Statue ) కార్యక్రమానికి మంత్రి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. ప్రభుత్వ  వైఫల్యాలపై మండిపడ్డారు. ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని విమర్శించారు. చెత్త పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. ఆ సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మూాడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత వెంటనే నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నం వచ్చారు.   అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు వెళ్లడంపై టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) మండిపడ్డారు.   వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే వైఎస్ఆర్‌సీపీ  నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి.వైఎస్ఆర్‌సీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు జిల్లాలు దాటి మరీ టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకతని మండిపడ్డారు. 

పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు,బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని సూచించారు.  గతంలోనూ టీడీపీ నేతలపై అప్పటికప్పుడు కేసులు పెట్టి ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు కూడా. కొత్త డీజీపీ వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Published at : 23 Feb 2022 01:03 PM (IST) Tags: cm jagan YSRCP AP Politics tdp vs ycp Ayyannapatradu

సంబంధిత కథనాలు

Anantapur TDP Kalva :  ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?

Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?

Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !

Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన  !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!

Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి