By: ABP Desam | Updated at : 19 Apr 2022 08:03 AM (IST)
అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్థన్ రెడ్డి (ఫైల్ ఫోటోలు)
నెల్లూరు నగరంలో కాకాణి వర్సెస్ అనిల్ అన్నట్టుగా రెండు వర్గాలు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. అయితే ఆ గొడవ అక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడే సెకండ్ పార్ట్ మొదలైంది. వాస్తవానికి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన అనిల్ గతంలో కాకాణి ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. అసలు తాను మంత్రిగా ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికి కాకాణి పిలవలేదనేది అనిల్ ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడు మంత్రి వర్గంలోనుంచి బయటకొచ్చిన తర్వాత అనిల్.. కాకాణి ఇలాకాలో తొలిసారిగా అడుగు పెట్టారు. వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామానికి చెందిన కూకటి శ్రీధర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు అనిల్.
సర్వేపల్లి గ్రామంలో యాదవుల కుల దేవత గంగమ్మ ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు. అనిల్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలి వచ్చారు. బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. ఇలా కాకాణి ఇలాకాలో భారీ కాన్వాయ్ తో, బాణసంచా కాల్పులతో ఎంట్రీ ఇచ్చారు అనిల్. కథ ఇక్కడితో ఆగిపోలేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా అనిల్ నియోజకవర్గం నెల్లూరు సిటీలో అడుగుపెట్టబోతున్నారు. నెల్లూరు నగరంలో ఆనం రామనారాయణ రెడ్డి ఇంటికి అతిథిగా వెళ్తున్న కాకాణి.. నెల్లూరు సిటీలో పర్యటిస్తారు. సహజంగా ఈ పర్యటనకు అనిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాకాణి అధ్యక్షతన జరిగిన జిల్లా రివ్యూ మీటింగ్ కి కూడా అనిల్ హాజరు కాలేదు. సో.. కాకాణి నెల్లూరులో పర్యటించినా అనిల్ హాజరయ్యే అవకాశం లేదు. అంటే కాకాణి ఇలాకాలో అనిల్, అనిల్ సెంటర్లో కాకాణి.. ఇలా ఇద్దరూ ఎక్కడా తగ్గేది లేదంటున్నారు.
ఇక నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా, మాజీ మంత్రులు ఒకేసారి పెట్టిన సభలతో ఇరువర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ సాగింది. అధిష్టానం జోక్యంతో కాస్త తగ్గిన నేతలు పరస్పర విమర్శలకు దూరంగా ఉన్నారు. ఇద్దరూ నేతలు తమ అనుచరులు, కార్యకర్తలతో ప్రశాంతంగానే సభలు నిర్వహించారు.
నాకు నేనే పోటీ: మాజీ మంత్రి అనిల్
నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అంటూనే మరోసారి ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు పక్కనపెట్టారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను మంత్రి పదవిలో ఉండగా సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలందరికీ థ్యాంక్స్ అంటూనే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేరెత్తలేదు. మిగతా అందరి పేర్లు చెప్పి మరీ వారికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ పూర్తి స్థాయిలో జనంలోకి వస్తానని, గడపగడపకీ వెళ్తానని చెప్పారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. సీఎం జగన్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పారు అనిల్. తాను బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అని, ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందేనన్నారు అనిల్. నాకు నేనే పోటీ అని స్పష్టం చేశారు అనిల్. 2024లో గెలిచి తిరిగి మంత్రి పదవిలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు అనిల్.
అనిల్ సభపై కాకాణి ఫస్ట్ రియాక్షన్
అందరూ అనుకున్నట్టుగానే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి ఎంట్రీ అదిరిపోయింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభ, మంత్రి కాకాణి అభినందన ర్యాలీ ఒకేరోజు ఉండటం, ఇటీవల కాకాణిపై అనిల్ మాటల తూటాలు పేల్చడంతో ఈ వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ దశలో పార్టీ హైకమాండ్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందనే వార్తలొచ్చాయి. అయితే మంత్రిగా తొలిసారి జిల్లాలో అడుగు పెట్టిన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ సభపై క్లారిటీ ఇచ్చారు. అది తనకు పోటీ సభ ఎంతమాత్రం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా స్థానికంగా సభ పెట్టుకోవడం పార్టీకోసమేనన్నారు. మీడియా దాన్ని పోటీసభగా చిత్రీకరించడం సరికాదన్నారు కాకాణి. కావలిలో తనకు లభించిన స్వాగతాన్ని తాను మరచిపోలేనని చెప్పారు కాకాణి.
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!