అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KCR BJP Agenda : తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్ - కేసీఆర్ నిర్ణయాలు కమలం పార్టీకే మేలు చేస్తున్నాయా ?

బీజేపీ సెట్ చేస్తున్న అజెండాను ఫాలో అవుతున్నారు కేసీఆర్. రాజకీయంగా బీజేపీ ట్రాప్‌లో పడిపోయారా? లేక కేసీఆర్ అలా కనిపిస్తూ భారీ ఎత్తుగడలు వేస్తున్నారా?

KCR BJP Agenda :  రాజకీయాల్లో  ఆవేశం కన్నా ఆలోచనే కీలకం. అలాంటి రాజకీయ ఆలోచనలు చేయడంలో శిఖరం కేసీఆర్. తెలంగాణ ఉద్యమం నిర్వహించిన తీరే దానికి సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు .. కేసీఆర్ ఓ ఎజెండా సెట్ చేస్తే అన్ని పార్టీలూ పాటించి తీరాల్సిందే. లేకపోతే రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడేది. అలా నడిచిన రాజకీయం ఇప్పుడు రివర్స్‌లో కనిపిస్తోది. ఆయన తనకు తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో పడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. ఇటీవల వరుసగా బీజేపీ కార్యక్రమాలకు  పోటీగా తాను కూడా  చేపడుతూండటమే. 

ఎప్పుడూ లేని తెలంగాణ సమైక్యతా ఉత్సవాలు జరపడంతో చర్చ!

ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేసీఆర్... తాము కూడా కేంద్రం  కంటే ఘనంగా చేస్తామని ప్రకటించారు. మూడు రోజుల పాటు సమైక్యతా ఉత్సవాల పేరుతో నిర్వహించారు. బీజేపీకి ఘనంగా కౌంటర్ ఇచ్చామని అనుకున్నారు. కానీ నిజంగా జరిగింది అదేనా ? . ఉద్యమంలో విమోచన ఉత్సవాల గురంచి భారీగా ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంటయిన కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా జరపడానికి కారణం  తామేనని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమే కదా అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. 

పోటీ స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో మేలు జరిగిందెవరికి ? 
 
 స్వాతంత్ర వజ్రోత్సవాల విషయంలోనూ అదే జరిగింది. కేంద్రం అమృతోత్సవాలను నిర్వహించాలనుకుంటే … కేసీఆర్ సర్కార్ అంత కంటే ఘనంగా నిర్వహించింది. ఇంటింటికి జెండాలను పంపిణీ చేసింది. కార్యక్రమాలను ఘనంగా చేసింది. కానీ అలా చేయడం వల్ల బీజేపీ పేరే ఎక్కువగా ప్రజల్లో చర్చకు వచచింది. బీజేపీకి మేలు చేసేలా స్వతంత్రంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు జరిగాయన్న అభిప్రాయం వినిపించింది. తెలంగాణ ప్రజల్లో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కేంద్రం చేసిందని అనుకునేవారే ఎక్కువ. ఎందుకంటే జాతీయవాదం.., దేశ భక్తి అనే విషయాల్లో బీజేపీ ... తెలంగాణ అంటే  టీఆర్ఎస్ ఎలా గుర్తుకు వస్తుందో అలాంటి ముద్ర వేసేసింది. 

మునుగోడు ఉపఎన్నిక బీజేపీ సెట్ చేసిందే !

మరో వైపు తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపులా మారిన మునుగోడు ఉపఎన్నిక కూడా బీజేపీ సెట్ చేసిందే. ఈ ఉపఎన్నికను అడ్డుకునే అవకాశం.. బీజేపీ వ్యూహాలను చిత్తు చేసే అవకాశం కేసీఆర్‌కు ఉంది. కానీ బీజేపీ అజెండానే ఆయన ఫాలో అయ్యారు. ఉపఎన్నికను ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఉపఎన్నికకు ముందు కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని బీజేపీ రాజకీయాలను చూస్తే అర్థమైపోతుంది వాటికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారు. 

మరికొన్ని విషయాల్లోనూ బీజేపీ అజెండాకే ఫాలో కాక తప్పని పరిస్థితి..!

ఇవే కాదు మరికొన్ని విషయాల్లోనూ బీజేపీ సెట్ చేసిన ఎజెండాను కేసీఆర్ ఫాలో కాక తప్పడంలేదు. పార్లమెంట్‌ బిల్డింగ్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డి్మాండ్ చేస్తూ.. సచివాలయానికి అంబేద్కరే పేరు పెట్టి జీవో ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలు దళిత సీఎం  హామీని తెర ముందుకు తెచ్చారు.  ఒకప్పుడు కేసీఆర్ అజెండా సెట్ చేస్తే రాజకీయాలు నడిచేవి. ఆయనకు తెలంగాణ ఉద్యమం అలా కలసి వచ్చింది. కానీ ఇప్పుడు  బీజేపీకి అలాంటిదేమీ లేకపోయినా..  అజెండా చేస్తోంది. కేసీఆర్ నడుస్తున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం ఉందో ముందు ముందు తెలుస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget