అన్వేషించండి

Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!

కొద్దికాలంగా బండి సంజయ్ ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ పడతారని అందరూ గెస్ చేస్తూ వచ్చారు. వేములవాడ నుండి వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

Bandi Sanjay Comments: బండి సంజయ్.. గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు బిజెపిలో ఎదిగిన నేత. మహామహులను కాదని ఢిల్లీ లోని బిజెపి అధిష్టానం ఏరికోరి ఎంపిక చేసుకున్న అధ్యక్షుడు. ఎక్కడ ఎలా ఫైర్ పుట్టించాలనేది బండికి తెలిసినంతగా దాదాపు ఆ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ఎవరికీ తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బండి సంజయ్ కరీంనగర్ లో చేసిన హాట్ కామెంట్ల పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈమధ్య కాశీ జ్ఞానవాపి మసీద్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బాటు అక్కడ మసీదులోని తటాకంలో శివలింగం ఉన్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పరిస్థితులను కూడా ప్రతిబింబించాలనే ఉద్దేశంతో బండి సంజయ్ కామెంట్ చేసారని అందరూ విశ్లేషిస్తున్నారు. 

అయితే ఇక్కడ మరో అంశం కూడా ముడిపడి ఉంది. రాజకీయంగా కరీంనగర్ చాలా ముఖ్యమైన పార్లమెంట్ స్థానం... వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అయితే గతంలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఎన్నడూ లేవు. ముఖ్యంగా మైనారిటీల ప్రాబల్యం ఉన్న కరీంనగర్ పట్టణంలో వారి ఓట్లు ఎక్కువగా బిజెపికి వ్యతిరేకంగా పడతాయి. ఈ అంశం బండి సంజయ్ కి తెలియనిది కాదు. కొద్దికాలంగా బండి సంజయ్ ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ పడతారని అందరూ గెస్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి .ప్రముఖ శైవక్షేత్రం కావడం, బండి సంజయ్ కు చెందిన కమ్యూనిటీ కి భారీ స్థాయిలో అక్కడ ఓట్ల సంఖ్య ఉండటం కలిసి వచ్చే అంశం అని అంచనాకు వచ్చారు. 

కానీ ఇప్పటికే అక్కడ బీజేపీ టికెట్ కి పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మహారాష్ట్ర గవర్నర్ సీనియర్ బిజెపి నేత అయిన విద్యాసాగర్రావు తనయుడు డాక్టర్ వికాస్ కి అక్కడ బిజెపి నుండి పోటీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన తండ్రి సాగర్.  మొదట్లోనే ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు ఉండడంతో బండి సంజయ్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిన కూడా బిజెపి క్రమక్రమంగా బలపడుతూ ఉండడంతో వచ్చే ఎన్నికల తర్వాత మరోమారు కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్లేషకుల అంచనా. ఇలాంటి సమయంలో మరోసారి కరీంనగర్ నుండి ఎంపీగా ఎన్నికయితే కేంద్రంలో కనీసం సహాయమంత్రి వరకు వెళ్లే అవకాశాలు బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతకు పుష్కలంగా ఉంటాయి. అందుకే మరోసారి ప్రజలకు చేరువ అయ్యే విధంగా వరుస కార్యక్రమాల్లో హాజరవుతూనే పలు అంశాలపై గట్టిగానే స్పందిస్తున్నారు బండి సంజయ్ .

ఇక కరీంనగర్ లోక్సభ స్థానం నుండి టిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి అంటూ ప్రస్తుతానికి ఎవరూ లేరు .ఒకవేళ సీఎం కేసీఆర్  ఇక్కడ నుండి పోటీ చేస్తే మరింత రసవత్తరంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బిజెపి మరోమారు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రభావం ఇక్కడి 13 నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా పక్క జిల్లాల్లోనూ పక్కాగా ఉంటుంది. ఇక ఒక దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్టుగా ఇక్కడనుండి పంపిన మెసేజ్ రాష్ట్రవ్యాప్తంగా రచ్చ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వేములవాడ లాంటి హిందూ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ దర్గాలు కొనసాగడం పట్ల పలు హిందూ సంఘాలు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక కరీంనగర్ పట్టణంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని దర్గా ఉండటం.. గతంలో స్మితా సబర్వాల్ కలెక్టర్గా ఉన్న సమయంలో దాన్ని తొలగించి రోడ్డు విస్తరణకు ప్లాన్ చేయగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ కరీంనగర్ సెంటర్ లో ఇలాంటి హాట్ కామెంట్ చేశారని ఒక అంచనాకు వేయవచ్చు. రానున్న రోజుల్లో మెజారిటీ వర్గం నుండి బలమైన మద్దతు దొరికితే ఎంపీగా గెలవడం పెద్ద సమస్య కాదు. అందుకే దీనికి పూర్తిస్థాయిలో ప్రిపేరవుతున్న సంజయ్ ఎన్నికల వేడిని ముందే రగిల్చారని అర్థం అవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
AP Mega DSC Politics: డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
డీఎస్సీ టీచర్లు వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ - విజేతల్ని అవమనిస్తున్నారా? వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తోందా?
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget