అన్వేషించండి

Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?

KCR: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయవచ్చని భావిస్తున్నరు.

Kaleshwaram case is reaching KCR: తెలంగాణలో న్యాయవిచారణలు కీలక దశకు చేరుకుటున్నాయి.  కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌కు కీలకమైన ఆధారాలు లభించాయని అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్న  ప్రచారం ఊపందుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నల్లా వెంకటేశ్వర్లు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను న్యాయ విచారణ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌కు అందజేశారు. గతంలోనూ ఆయనను కమిషన్ పిలిచి ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన ఒక్కటి కూడా దాచుకోకుండా పూర్తి వివరాలు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. 

విచారణ కమిషన్ వద్ద డీపీఆర్                  

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్‌దేనని ఇప్పటి వరకూ విచారణకు హాజరైన అధికారులు చెబుతూ వచ్చారు.  నిర్ణయాలు, అధికారిక వ్యవహారాలు, ప్లానింగ్‌, డిజైనింగ్‌, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అన్ని వివరాలనూ విచారణ కమిషన్ సేకరించింది.  డీపీఆర్‌ అంశాలు కూడా కమిషన్‌కు చేరాయని భావిస్తున్నారు.  డీపీఆర్‌ను  అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదించారని అధికారులు స్ప,్టం చేశారు.  కాళేశ్వరం డిజైన్లనూ ఫైనల్‌ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారని ఇందుకు సంబంధించి పలు సమావేశాలు, మినిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు, మూడు బ్యారేజీల వివరాలను కమిషన్‌కు చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది.  

ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న

ఆ ఫైళ్లలోనే కీలక ఆధారాలు                     
 
విచారణ కమిషన్‌కు చేరిన ఫైళ్లలో ఉన్నతాధికారులు, కాళేశ్వరం బాధ్యతలు చూసిన సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, ఏఈలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి.   మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయనీ, అందులో బ్లాకులు కుంగడానికి, సీపేజీలు రావడానికి పిల్లర్ల కింద ఇసుక కదిలిపోవడమే కారణమని  ఇప్పటికే నివేదికలు ఇచ్చారు. పీసీ ఘోష్ కమిషన్  అధికారుల స్థాయిలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కూడా చేస్తున్నారు. దీంతో అధికారులు ఒక్కటి కూడా దాచడానికి అవకాశం లేకుండా పోతోంది. ఆ ప్రాజెక్టు వ్యవహారంలో జరిగింది మొత్తం విచారణ కమిషన్‌కు వెల్లడించారని చెబుతున్నారు. 

తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

నెక్ట్స్ కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు 

అధికారుల స్థాయిలో విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి విచారణకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను పిలిచే అవకాశం ఉందని జలసౌధలో ప్రచారం జరుగుతోంది.  అధికారుల వాంగ్మూలాలు అన్ని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావును బుక్ చేసేలా ఉన్నాయి.  ప్రాజెక్టు వైఫల్యానికి కారకులను తేల్చే క్రమంలో ఎవరినైనా పిలుస్తామనీ, విచారణకు రాకపోతే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుం టామని గతంలో  జస్టిస్‌ ఘోష్‌ చెబుతున్నారు.   ఎన్డీఎస్‌ఏ, పోలీస్‌ విజిలెన్స్‌ నివేదికల ఆధారంగా కమిషన్‌ విచారణ చేస్తారు. రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తే ఈ కేసు సంచలనం అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget