అన్వేషించండి

Kailash Gahlot: బీజేపీలో చేరిన ఆప్ మాజీ నేత కైలాశ్ గహ్లోత్ - రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలపై గహ్లోత్ కౌంటర్

BJP: ఆప్ పార్టీకీ రాజీనామా చేసిన కైలాశ్ గహ్లోత్ సోమవారం బీజేపీలో చేరారు. అయితే, ఒత్తిడి వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్న ఆప్ నేతల వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.

Kailash Gahlot Joins BJP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీ (AAP)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) సోమవారం బీజేపీలో చేరారు. ఆదివారం తన పదవికి, ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు (Kejriwal) పంపారు. ఇందులో పలు కారణాలను వివరించారు. 'పార్టీ స్థాపించినప్పటి విలువలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. అందర్నీ ఏకం చేసిన విలువ నుంచి పార్టీ దూరమై పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను రాజకీయ ఆశయాలు అధిగమించాయి. ఫలితంగా చాలా వాగ్దానాలు నెరవేరకుండా మిగిలిపోయాయి. కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణలో అవకతవకలు, యమునా నదిలో కాలుష్యం సమస్య, అంతర్గత విభేదాలు ఇవన్నీ పార్టీని వీడడానికి కారణం.' అని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయి. మొన్నీ మధ్య జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్‌ తను రాజీనామా చేసి తన  పార్టీ నేత అతిషీని ఢిల్లీ సీఎంగా కూర్చోబెట్టారు. 

అటు, గహ్లోత్ రాజీనామాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే ఈ రాజీనామా జరిగిందని.. గహ్లోత్‌ను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే గహ్లోత్ ఆరోపణలు చేస్తున్నారని.. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గహ్లోత్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని అన్నారు. 

గహ్లోత్ కౌంటర్

అయితే, ఆప్ ఎంపీ వ్యాఖ్యలపై గహ్లోత్ కౌంటర్ ఇచ్చారు. ఇది తనకు సులభమైన నిర్ణయం కాదని.. అన్నా హజారే సమయం నుంచి తాను ఆప్‌లో ఉన్నానని అన్నారు. 'ఎమ్మెల్యే, మంత్రిగా ఢిల్లీకి నా వంతు సేవలు అందించాను. ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు. ఒత్తిడి వల్ల నేను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారికి స్పష్టం చేస్తున్నాను.' అని పేర్కొన్నారు. కాగా, సీఎం పదవికి ఇటీవల కేజ్రీవాల్ రాజీనామా చేసిన క్రమంలో.. ఆ సీటు కోసం ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ ఛడ్డా, కైలాశ్ గహ్లోత్ పేర్లు వినిపించాయి. అయితే, సీఎంగా ఆతిశీకి కేజ్రీవాల్ అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఆయన అసంతృప్తికి కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, ఎమ్మెల్యే రఘువిందర్ షొకీన్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆప్ తెలిపింది.

Also Read: Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YSRCP: ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
YS Jagan Election : చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?
చొక్కా మడతవేస్తాం - జగన్ కామెంట్స్‌తో రాయలసీమలో పోలింగ్ ఉద్రిక్తం కానుందా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget