Janasena Meeting : ఇక నుంచి రాజకీయాలకే పవన్ పూర్తి సమయం - శనివారం పార్టీ భేటీలో ప్రకటించే అవకాశం !
జనసేన విస్తృత కార్యవర్గ సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంటున్నారు.
Janasena Meeting : జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జులు పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. శుక్రవారం ముఖ్య నాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
ముందస్తు ఎన్నికలకు సన్నద్ధత
రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ముందుగానే ఎన్నికల వేడి మెదలైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్దితులు పై పవన్ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కార్యకర్తలపై ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన వేధింపులపై పవన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యవహరం పై డీజీపిని కలవాలని కూడా పవన్ భావిస్తున్నారు. అయితే అంతకు ముందు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు పై కూడా పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని నేతలు చెబుతున్నారు.
పార్టీ ఇంచార్జుల పనితీరుపై సమీక్ష
విస్తృత స్దాయి సమావేశం లో నాయకుల నుండి అభిప్రాయాలు తెలుసుకోవటంతో పాటుగా నియోజకవర్గాల ఇంచార్జ్ ల పై కూడ పవన్ నివేదికను తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ,జనసేన కలసి పని చేస్తున్నందున పొత్తులు విషయం క్లారిటి వస్తే, ఇక రాబోయే రోజుల్లో నియోజకవర్గాల ఇంచార్జ్ లకు పరోక్షంగా,కాని ప్రత్యక్షంగా కాని ఆదేశాలు ఇచ్చి ఆయా నియోజకవర్గాల్లో పరిస్దితులు పై కూడా దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు సినిమాలు,ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్ అని పవన్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలకే సమయం కేటాయిస్తారా ?
శనివారం సమావేశంలో 2024 ఎన్నికలను కేంద్రంగా చేసుకొని పవన్ ఎలాంటి వ్యూహాలను తెరమీదకు తెస్తారు.. ఇక రాబోయే రెండు సంవత్సరాలు పూర్తిగా పార్టీకి సమయాన్ని కేటాయిస్తారా అనే విషయాలు పై పవన్ క్లారిటి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ లో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్, పార్టీ రాజకీయ వ్యవహరాలను పూర్తిగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిస్దితులను పవన్ కు వివరిస్తున్నారు. ఇటు మరో మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా ఉత్తరాంద్రలో పార్టి ని పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న నాయకులను కలుపుకొని సమావేశాలు నిర్వహించారు. ఈ మెత్తం పరిస్దితులు పై పవన్ శనివారం ఉదయం ముఖ్య నేతలతో సమావేశంలో చర్చిస్తార.ు ఆ తరువాత పార్టి విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అవుతుందని పార్టి వర్గాలు చెబుతున్నాయి.