అన్వేషించండి

Pothina Mahesh: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ - పార్టీకి కీలక నేత రాజీనామా

Andhrapradesh News: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత పోతిన మహేష్ సోమవారం జనసేనకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించారు.

Pothina Mahesh Resigned To Janasena: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన (Janasena) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత పోతిన వెంకట మహేష్ (Pothina Venkata Mahesh) సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపించారు. కాగా, విజయవాడ పశ్చిమ టిెకెట్ ను మహేష్ ఆశించారు. అయితే, టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. ఈ టికెట్ తనకే కేటాయించాలని పలు సందర్భాల్లో మహేష్ డిమాండ్ చేస్తూ వచ్చారు. తన అనుచరులతో కలిసి నిరసన, ఆందోళనలు నిర్వహించారు. అయితే, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు.
Pothina Mahesh: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ - పార్టీకి కీలక నేత రాజీనామా

లేఖలో ఏం చెప్పారంటే.?

పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ జనసేనానికి ఈ సందర్భంగా లేఖ రాశారు. 'జనసేన పార్టీలో నాకున్న పదవీ బాధ్యతలు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటివరకూ నాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు, పెద్దలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.' అంటూ లేఖలో పేర్కొన్నారు. 

కాగా, 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన మహేష్ ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ పోటీ చేసి ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచించారు. అయితే, టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. అటు, టీడీపీ నుంచి కూడా ఈ సీటు కోసం గట్టిగానే పోటీ నడిచింది. సీటు విషయంలో టీడీపీ నేతలు వెనక్కి తగ్గినా పోతిన మహేష్ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో ఆయన భవిష్యత్ కార్యచరణ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆయన ఓ పార్టీలో చేరుతారో అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Andhra Pradesh News: తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు నిప్పు- ఉలిక్కిపడ్డ పల్నాడు- 144 సెక్షన్ విధింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Shardiya Navratri 2024: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ  తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
Embed widget