అన్వేషించండి

HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?

HYDRAA Action: హైడ్రా కూల్చివేతల వెనుక పొలిటికల్ ఎజెండా ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ సన్నిహితులు అక్రమంగా పొందిన ప్రాజెక్టుల్ని టార్గెట్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Who is RealEstate Ramudu: హైదరాబాద్ మహానగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే ధ్యేయంగా దూసుకుపోతున్న  హైడ్రా చర్యలు రోజురోజుకూ సరికొత్త పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. కేవలం సాధారణ నిబంధనల ఉల్లంఘనల ఆధారంగానే కాకుండా, ఒక పక్కా వ్యూహం ప్రకారం బడా ప్రాజెక్టులపై హైడ్రా విరుచుకుపడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రదీప్ బిల్డర్స్, సంధ్యా కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీధర్ రావుకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు మరికొన్ని ప్రతిష్టాత్మక నిర్మాణాలను హైడ్రా టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయనే చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జోరందుకుంది.

హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నింటికీ ఇంటర్ లింక్ ఉందా? 

ఈ మొత్తం వ్యవహారంలో తెరపైకి వస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హైడ్రా విరుచుకుపడుతున్న ఈ బడా ప్రాజెక్టులన్నింటికీ ఒక అంతర్గత లింక్  ఉందనే ప్రచారం సాగడం. ఈ లింక్ నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  వైపు కనెక్ట్ అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా విసిరిన కొన్ని పరోక్ష విమర్శలు,  రియల్ ఎస్టేట్ రాముడు అంటూ పెట్టిన నిక్ నేమ్ ఈ చర్చలకు మరింత ఆజ్యం పోశాయి. గత ప్రభుత్వ హయాంలో ఐటీ, మున్సిపల్ శాఖల నీడన సాగిన కొన్ని బడా రియల్ ఎస్టేట్ లావాదేవీల చిట్టా ఇప్పుడు బయటకు వస్తోందనే సంకేతాలు దీని ద్వారా వ్యక్తమవుతున్నాయి.

రియల్ ఎస్టేట్ రాముడు పేరుతో కేటీఆర్‌ను టార్గెట్ చేశారా? 

నిజానికి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఊహించని స్థాయికి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే తెరవెనుక అనేక భారీ ఆర్థిక లావాదేవీలు,   చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధుల మార్పులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ఇన్ అండ్ అవుట్ లావాదేవీలపై, ఎవరెవరికి వాటాలు వెళ్లాయనే దానిపై పక్కా సమాచారం ఉంటుంది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత, వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఆయా సంస్థల అంతర్గత సమాచారం,  పాత లీకులు కొత్త ప్రభుత్వ పెద్దల చేతికి చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీకుల ఆధారంగానే, గత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ నిబంధనలను బేఖాతరు చేసిన సదరు బడా బిల్డర్ల ప్రాజెక్టులనే హైడ్రా ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో బలంగా వినిపిస్తోంది. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు.. గత పాలకుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఒక వ్యూహాత్మక పొలిటికల్ అటాక్ అని భావిస్తున్నారు. ఎక్కడైతే గత ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు లేదా బినామీ హస్తాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయో, సరిగ్గా ఆయా కట్టడాల వద్దకే హైడ్రా బుల్డోజర్లు వెళ్తుండటం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

ఈ హైడ్రా వేట ఇంతటితో ఆగిపోతుందా? 

 ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. ఈ హైడ్రా వేట ఇంతటితో ఆగిపోతుందా? లేక తెరవెనుక ఏవైనా  బ్యాక్ గ్రౌండ్ సెటిల్మెంట్లు  జరుగుతాయా? అనేది. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి భారీ దాడులు జరిగినప్పుడు, సదరు వ్యాపారులు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ పెద్దలతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారనేది ఓ బహిరంగ రహస్యం. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో హైడ్రా నిజంగానే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుని, ఈ బడా ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలైన సూత్రధారులను చట్టం ముందు నిలబెడుతుందా.. లేదా కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ఈ రచ్చ సాగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. హైడ్రా తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు అటు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి, ఇటు భాగ్యనగర రియల్ ఎస్టేట్ మాఫియాకు ఒక బలమైన హెచ్చరిక లాంటివని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget