అన్వేషించండి

TRS Chief Kavitha Comments: బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము! టీఆర్‌ఎస్‌పై కుట్రలు! 20 నుంచి నిరవధిక దీక్ష! కవిత కీలక ప్రకటన! 

TRS Chief Kavitha Comments: బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని దాన్ని వెంటనే అమరవీరులకు పంచాలని టీఆర్‌ఎస్ చీఫ్‌ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీఆర్ఎస్ రూ.1,400 కోట్లు అమరవీరులకు పంచాలని కవిత డిమాండ్.
  • బీఆర్ఎస్‌కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.
  • కేటీఆర్ అవినీతి, పయనీర్ కొనుగోళ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.
  • సింగరేణి కార్మికుల కోసం 20 నుండి నిరవధిక దీక్ష ప్రకటించారు.

TRS Chief Kavitha Comments: సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై  మీడియాతో మాట్లాడిన టీఆర్‌ఎస్ చీఫ్‌ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని అన్నారు. దీన్ని వెంటనే అమరవీరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేదన్నారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు కోసం 20వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.   

టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా ఉండాలనే కుట్రతో ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ బీఆర్‌ఎస్ ఇచ్చిందని చెప్పారు. భయం లేదంటూనే  కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీతో చేతులు కలుపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా అని ప్రశ్నించారు. తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు, కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్‌ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని అన్నారు. "కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీశ్‌రావు నే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది. ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడదని స్పష్టమైంది. చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట?. బీఆర్ఎస్ మీద కోపంతో కాళేశ్వరం నీళ్లను ముఖ్యమంత్రి ఎత్తిపోయటం లేదు. అర కిలోమీటర్ రాళ్ల కట్ట కడితే మొత్తం నీళ్లు ఎత్తిపోసుకోవచ్చు." అని అన్నారు. 

పార్టీ పెట్టుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ విషయంలో ఎక్కడ పర్సనల్ విషయాలు చెప్పలేదని కవిత అన్నారు. "పార్టీ పెట్టిన ఆరు నెలల వరకు అన్ని పార్టీల గురించి మాట్లాడి ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ నా పార్టీతో భయం లేదంటూనే బీఆర్ఎస్ వాళ్లు వెయ్యి కి పైగా ఈసీకి కంప్లైంట్స్ ఇచ్చారు. మా పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోంది. అదే విధంగా 188 కోట్లు పెట్టి కేటీఆర్ ఇటీవలే పయోనీర్ అనే ఇంగ్లీష్ పేపర్ కొనుగోలు చేశాడు. క్విడ్ ప్రొకోలో భాగంగా తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్‌కు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చి పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చాడు. 

డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా?. పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి నీతి, నియమం, ఒక విధానం అంటూ లేకుండా చేస్తున్నారు. ఒక పార్టీ తన విధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా? మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారు. అంటే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా?"

"అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న 14 వందల కోట్ల రూపాయలు క్విడ్ ప్రొ కో ద్వారా వచ్చినవి కావా? మీ పార్టీలో అకౌంట్‌లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంచాలని డిమాండ్ చేస్తున్నా. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడండి. నేను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ లో చేరేదే లేదు. ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వాడు ఆంధ్రావాడా? తెలంగాణ వాడా? ఆ సంస్థ వాడు 33 లక్షల టన్నుల కలప కొట్టేస్తున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పెట్టిన కేసులను కూడా మళ్లీ పట్టించుకోవటం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం కూడా భూమి ఇస్తోంది. అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది." 

కచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించిన భూములు అన్నింటిపైన రివ్యూ చేస్తామన్నారు. మొత్తం అవినీతిని కక్కిస్తామన్నారు. ఎవరినీ కూడా వదలిపెట్టబోమని చెప్పారు. ఈ రెండు పార్టీలకు అసలు ప్రజా అజెండా అనేదే లేదని మండిపడ్డారు. కేవలం దోచుకోవటం మీద దృష్టి ఉందని ఫైర్ అయ్యారు. "తెలంగాణ ఉద్యమం సమయంలో చిన్న కాంట్రాక్టర్లు, స్కూల్ యాజమాన్యాలు ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత వారికి న్యాయం జరగాలని నేను బీఆర్ఎస్ లో ఉండి కొట్లాడాను. అప్పుడు కూడా ఉద్యమకారులు, కార్మికుల కోసం నేను ఫైట్ చేశాను. కార్మికులతో ఎవరున్నారో, కాంట్రాక్టర్లతో ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. బీఆర్ఎస్‌లో ఉండి కూడా ఉద్యమకారుల కోసం వారి పక్షాన నిలబడ్డాను. కానీ వారికి అన్యాయం జరిగింది. అందుకే చాలా ఆవేదనతో చెబుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న డబ్బును అమరవీరుల కుటుంబాలకు పంచాలి. 

Frequently Asked Questions

బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న అవినీతి సొమ్ము గురించి కవిత ఏమన్నారు?

బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము ఉందని కవిత ఆరోపించారు. ఈ సొమ్మును అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు.

కవిత బీఆర్ఎస్‌లో మళ్లీ చేరుతారా?

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి మళ్లీ వెళ్లేది లేదని కవిత స్పష్టం చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కేటీఆర్ అవినీతి గురించి కవిత ఏ ఆరోపణలు చేశారు?

కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్‌ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని కవిత ఆరోపించారు. పెద్ద భవనాలు కట్టుకునే అవకాశం ఇచ్చారని చెప్పారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత ఏం చేయనున్నారు?

సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కవిత మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 20వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget