అన్వేషించండి

HYDRAA Action : 100 గజాల్లో 6 అంతస్తులు - హైదరాబాద్‌ను చుట్టుముడుతున్న అక్రమ కాంక్రీట్ వనాలు – ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది?

Illegal Buildings : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు పెద్ద సమస్యగా మారాయి. చిన్న స్థలాల్లో పెద్ద బిల్డింగులు కడుతున్నారు. ఎలా నివారించగలరు?

GHMC Town Planning Building Violations:  హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ నుంచి మొదలుకొని పాతబస్తీ, మల్కాజిగిరి, ఉప్పల్ వరకు ఏ గల్లీలో చూసినా ఒకే దృశ్యం కనిపిస్తుంది. కేవలం 60 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న చిన్న ప్లాట్లలో ఏకంగా 5 నుండి 7 అంతస్తులు లేపేస్తున్నారు. ప్లానింగ్ పర్మిషన్లు  ఒకలా ఉంటే, నిర్మాణంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తుల మ్యాచ్‌బాక్స్ తరహా భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. సెట్‌బాక్స్  లేకపోవడం, ఫైర్ సేఫ్టీ సున్నా కావడం, అసలు పార్కింగే లేకుండా రోడ్లనే ఆక్రమించడం హైదరాబాద్‌ నగర ప్లానింగ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ భవనాలు కొనుగోలుదారులకు చౌకగా లభిస్తున్నప్పటికీ, నగర భద్రతకు బాంబుల్లా మారాయి.

ఇలాంటి ఇళ్లను కూల్చడం కూడా అసాధ్యమే

ప్రజల్లో ఒక పెద్ద సందేహం నెలకొంది చెరువులు, నాలాలు, చెరువు బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న  హైడ్రా మరి వీధివీధినా వెలిసిన ఈ చిన్న ప్లాట్ల బహుళ అంతస్తుల భవనాలపై కూడా కూల్చివేతల ఆయుధాన్ని ప్రయోగిస్తుందా? విశ్లేషకుల అంచనా ప్రకారం, వీటన్నింటినీ నేలమట్టం చేయడం ప్రభుత్వం ,  హైడ్రా వల్ల అసాధ్యం. నగరంలో ఇలాంటి భవనాలు లక్షల్లో ఉన్నాయి. వాటిని పూర్తిగా కూల్చేస్తే లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా, నగరంలో ఊహించని శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక సంక్షోభం ఏర్పడతాయి.  నదులు, చెరువులను రక్షించడం ఒకెత్తయితే.. నగర గల్లీల్లో ఏ నిబంధనా లేకుండా వెలుస్తున్న అక్రమ కట్టడాలను నియంత్రించడం మరొకెత్తు. వీటిని కూల్చడం సాధ్యం కాదు కాబట్టి  స్ట్రక్చరల్ ఆడిట్,  భారీ జరిమానాలు  మాత్రమే ప్రభుత్వానికి ఏకైక మార్గం. 
 
 ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందున్న వ్యూహాలు 

  భూకంపాలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా ఈ భవనాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వీటిని కూల్చలేకపోయినా, ఇంజనీరింగ్ నిపుణులతో భవనం ఎంతవరకు సురక్షితమో తేల్చేందుకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఆడిట్  నిర్బంధం చేయవచ్చు.  ప్రమాదకరంగా ఉన్న వాటికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించవచ్చు.  నిబంధనలు దాటి కట్టిన అంతస్తులకు వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్, తాగునీటి చార్జీలు విధించడం లేదా అదనపు ఆస్తి పన్ను విధించడం ద్వారా బిల్డర్లకు షాక్ ఇవ్వవచ్చు.   అనుమతులు లేని అంతస్తుల విక్రయాలను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదు కాకుండా నిలిపివేయడం. బిల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా కడితే వాటిని అమ్మే అవకాశం లేకుండా  బ్లాక్ లిస్ట్ చేయవచ్చు.   గతంలో అమలు చేసినట్లు భారీ పినలైజేషన్‌తో కొత్త BPS రూల్స్ తీసుకువచ్చి, అక్రమ నిర్మాణాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయడం. ఎన్ఓసీ   రాని భవనాలకు విద్యుత్ సప్లై రద్దు చేయడం ద్వారా కట్టడి చేయడం ద్వారా కొంత వరకూ నియంత్రించవచ్చు. 

 సమూల మార్పు రావాలంటే అధికారులపై వేటు పడాల్సిందే! 

100 గజాల ప్లాట్‌లో 6 అంతస్తులు లేస్తుంటే స్థానిక జిహెచ్‌ఎంసి , టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. క్షేత్రస్థాయి అధికారుల మామూళ్ల వల్లే ఇవి విచ్చలవిడిగా వెలిశాయన్నది బహిరంగ రహస్యం. కొత్తగా కడుతున్న నిర్మాణాలను ప్రారంభ దశలోనే నిలిపివేయడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడం ద్వారా మాత్రమే ప్రభుత్వం భవిష్యత్తు అక్రమాలకు అడ్డుకట్ట వేయగలదు. ఇప్పటికే పూర్తయిన 6 అంతస్తుల ఇళ్లను కూల్చివేయడం హైడ్రాకు గానీ, ప్రభుత్వానికి గానీ ఆచరణ సాధ్యం కాదు. కానీ, భారీ ఫైన్లు, సర్వీసుల కోత, స్ట్రక్చరల్ ఆడిట్‌ల ద్వారా వాటిని అదుపు చేస్తూ.. ఇకపై కొత్తగా 100 గజాల్లో ఇటువంటి రాక్షస నిర్మాణాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ చట్టాలను కఠినతరం చేయడమే తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఏకైక పరిష్కారం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget