అన్వేషించండి

Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..

CM Revanth Reddys Delhi Visit | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ సైతం ఢిల్లీకి వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొండా సురేఖ వ్యవహారంపై ఉత్కంఠ.
  • సురేఖ తొలగింపుపై టీపీసీసీ నివేదికను హైకమాండ్ పరిశీలించింది.
  • కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం సీఎం ఆగ్రహానికి కారణం.
  • రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చలు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌‌గా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు.  మంత్రి కొండా సురేఖ సైతం ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేసీ వేణుగోపాల్ సహా ఢిల్లీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చుకునే అవకాశాలు 

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వైఖరిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ నిబంధనలను అతిక్రమించడం, పార్టీకి భంగం కలిగించేలా ప్రవర్తించిన వీరిని పదవుల నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ముఖ్యంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కుమార్తె అనుచిత వ్యాఖ్యలు, విమర్శలను కొండా సురేఖ దంపతులు ఖండించలేదు. కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నానికి బదులుగా తాము సుస్మితను ఎలా నియంత్రిస్తామంటూ కొండా మురళీ చేసిన చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. సుస్మిత ప్లాన్ ఏలో భాగంగా ఇలా కామెంట్ చేసి ఉండొచ్చునని, ప్లాన్ బీ ఏంటో తమకు తెలియదన్నారు. ఇంత జరిగినా పార్టీ నుంచి తీవ్ర విరమ్శలు వచ్చినా కొండా దంపతులు సుస్మిత వ్యాఖ్యలను తప్పుపట్టలేదు, కనీసం ఖండించకపోవడం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలకు కోపాన్ని తెప్పించి ఉండొచ్చు. దాంతో మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని, క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను సైతం ఆయన అధిష్ఠానం వద్ద ప్రస్తావించవచ్చు. 

కొత్తవారికి అవకాశం కల్పించడం లేదా మంత్రివర్గ విస్తరణ ప్రక్రియకు కొంత సమయం పట్టినా, సురేఖ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని పార్టీ నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించారని.. అందుకే నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు సురేఖపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సడలింపు నిమిత్తం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇన్‌ఛార్జి నుండి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తప్ప, కొండా సురేఖను మంత్రివర్గం నుండి వేటు వేయడం దాదాపు ఖాయంగా మారనుంది.  

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నారు. విజయవాడ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయి చర్చించనున్నారు. దీనితో పాటు వరంగల్ మామునూరు విమానాశ్రయం పనుల అభివృద్ధి పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలవనున్నారు. రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. డిసెంబరు 7 నుండి 9 తేదీల్లో ఫ్యూచర్‌సిటీ వేదికగా నిర్వహించనున్నఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సులో పలు డిఫెన్స్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 

Frequently Asked Questions

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణాలు ఏమిటి?

కొండా సురేఖ వ్యవహారంపై చర్చలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ ఈ పర్యటనకు ప్రధాన కారణాలు. మెట్రో విస్తరణ, విమానాశ్రయం అభివృద్ధి, రక్షణ రంగ పెట్టుబడులపై చర్చిస్తారు.

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది?

అధిష్టానం క్రమశిక్షణా కమిటీ నివేదికను పరిశీలించి, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే అవకాశం ఉంది. కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు?

విజయవాడ, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ, వరంగల్ మామునూరు విమానాశ్రయం పనుల అభివృద్ధిపై చర్చిస్తారు. రక్షణ రంగ పెట్టుబడులపై కూడా చర్చలు జరుపుతారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
RAPO23 Update : రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
రామ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ - RAPO23 నుంచి క్రేజీ అప్డేట్
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Embed widget