Hindupur Balakrishna : హిందూపురం జిల్లా సాధనే లక్ష్యం...మౌనదీక్ష ప్రారంభించిన బాలకృష్ణ !
హిందూపురం జిల్లా కోసం నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష ప్రారంభించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షాన్ని కలుపుకుని ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.
హిందూపురం జిల్లా కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు. హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి మౌనదీక్ష చేపట్టారు. గురువారమే హిందూపురం చేరుకున్న బాలకృష్ణ పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో మౌనదీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ ఆయన మౌనదీక్ష చేస్తారు.
ఆ కాపు ఉద్యమ నేతలకు గుడ్‌న్యూస్.. టీడీపీ హయాంలో పెట్టిన కేసులన్నీ జగన్ సర్కార్ విత్ డ్రా
అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం వచ్చే సరికి ప్రభుత్వం పుట్టపర్తి వైపు మొగ్గు చూపడం హిందూపురం వాసుల్ని నిరాశపరిచింది.
అడగకుండానే ఉద్యోగులకు అన్నీ ఇచ్చి తప్పుచేశామా? ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం!
జిల్లాల విభజనకు మొదటి నుంచి మద్దతుగా మాట్లాడుతున్న బాలకృష్ణ హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాట తప్పడంతో ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం మౌనదీక్ష పూర్తయిన తర్వాత ఆయన హిందూపురం నియోజకవర్గంలోని అన్ని పార్టీలు, స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలతో సమావేశం అవుతారు. అందరితో చర్చించి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హిందూపురం జిల్లాను సాధించాలని బాలకృష్ణ పట్టుదలగా ఉన్నారు. అందర్నీ కలుపుకని వెళ్లి పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.
ఏపీ ప్రభుత్వం కావాలనే కరెంట్ కోతలు పెడుతోందా? అసలు నిజాలేంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని పార్టీ హైకమాండ్‌ను కోరుతున్నారు. కానీ వారు ఆందోళనలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రిని ఒప్పించి తాము హిందూపురం జిల్లాను సాధిస్తామని వారు ప్రజలకు హామీ ఇస్తున్నారు. మొత్తంగా హిందూపురం ప్రజల అభిప్రాయం మాత్రం జిల్లా కేంద్రం అక్కడే ఉండాలని.. కానీ ప్రభుత్వం మాత్రం వేరేగా ఆలోచిస్తోంది. ఈ ఉద్యమం బాలకృష్ణ ఎంత తీవ్రంగా చేపడతారో వేచి చూడాలి !