కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడి కీలక ప్రకటన- పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చినట్టేనా!
జనసేనలో చేరటం లేదని బీజేపి నేత,మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు స్పష్టం చేశారు. కన్నా పై వస్తున్న అసత్య వార్తలను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. అ ప్రచారం పీక్స్‌కు చేరటంతో కన్నా అనుచరులు స్పందించారు. కన్నాకు అత్యంత సన్నిహితంగా ఉండే తురగా నాగభూషణం కన్నా లక్ష్మీనారాయణ పార్టీ ఓ ప్రకటన చేశారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. వ్యక్తి గత కారణాలతోనే బీజేపీ నిర్వహిస్తున్న సమావేశానికి కన్నా హజరు కాలేకపోతున్నారని వివరణ ఇచ్చారు. ఈ విషయాన్న పార్టీ అదిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా ఆయన తన ప్రకటనలో తెలిపారు. అనవసరంగా రాజకీయ ప్రత్యర్థులు చేసే ప్రచారంలో కన్నా అభిమానులు, బీజేపీ శ్రేణులు చిక్కుకోవద్దని సూచించారు.
సత్తెనపల్లి నుంచి కన్నా పోటీ...
పార్టీ మార్పు వ్యవహారాలపై కన్నా చుట్టూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జనసేనలో కన్నా చేరే తేదీ ఖరారు అయ్యిందని, జనవరి 26న పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు సత్తెనపల్లి నుంచి అసెంబ్లీ స్దానానికి జనసేన టిక్కెట్‌పై కన్నా పోటీ చేసేందుకు పవన్ ఓకే చెప్పారని ప్రచారం చేశారు. జనసేనలో కన్నాకు కీలక బాధ్యతలను అప్పగిస్తారని, పార్టీలో టాప్ 5 స్థానాల్లో కన్నాకు ప్రాధాన్యత ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని టాక్ నడిచింది.
పవన్... నాదెండ్ల...కన్నా....
జనసేనలో ఇప్పటి వరకు టాప్ 2 నేతలు మాత్రమే ఉన్నారు. అందులో పవన్,నాదెండ్ల మనోహర్ మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు వస్తే, పార్టీలో టాప్ త్రీ స్థానం దక్కుతుందని పవన్ హామీ ఇచ్చారని అంటున్నారు. రాజకీయ పరంగా పూర్తి అనుభవం కలిగిన కన్నా వంటి నేత వస్తే పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని పవన్ భావిస్తున్నారని అంటున్నారు.
కన్నాతో నాదెండ్ల భేటీ...
కన్నా లక్ష్మీనారాయణతో ఇప్పటికే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ నేతలు మాత్రం క్లారిటి ఇవ్వలేదు. కన్నాను కలిసిన తరువాత పార్టీలో చేరేది లేనిది అనే అంశంపై క్లారిటి రాలేదు. దీంతో అసందర్బంగానే చర్చలు ముగిసాయని కూడా నేతలు అంటున్నారు.
చివరి నిమిషంలో బీజేపీలోకి కన్నా...
బీజేపీలోకి కన్నా లక్ష్మీనారాయణ చేరిక వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. వైసీపీలో చేరతారని భావించిన ఆ పార్టీ నేతలు గుంటూరులో పెద్ద ఎత్తున కన్నాకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. కన్నాకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడి పోస్ట్ దక్కటంతోనే చివరి నిమిషంలో కన్నా వైసీపీలో చేరే విషయంలో డ్రాప్ అయ్యి, బీజేపీ చెంతకు చేరారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఒత్తిడిలోనే కన్నా ఆసుపత్రిలో చేరటం కూడా అప్పట్లో సంచలంగా మారింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపిలో చేరటం కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి హైడ్రామా నడుస్తోందని గుసగుసలు విపిస్తున్నాయి.