Exit Poll Results 2024 LIVE: లోక్‌సభ ఎన్నికలపై ABP C-Voter ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్
Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: దేశ వ్యాప్తంగా 7 దశలలో లోక్‌సభ ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. జూన్ 1న సాయంత్రం ప్రముఖ మీడియా ABP CVoter Exit Poll విడుదల చేయనుంది.
LIVE
Background
Exit Polls On June 1 : రాజకీయ పార్టీలన్నీ ఫలితాల కోసం రెడీ అయిపోయాయి. చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన నిర్వహించారు. పోలింగ్ గడువు ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అవకాశం ఉంది. అన్ని ప్రముఖ సంస్థలు అప్పుడే తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. ఇందు కోసం రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లు సైతం ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆసక్తి
ఎన్నికల ఫలితాలను ముందుగా అంచనా వేయాలని, తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు సాధారణంగానే ఉంటుంది. అందుకే పోల్ స్ట్రాటజీల కోసం ఇప్పుడు ప్రత్యేక కంపెనీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. వారు సర్వేలు చేసి.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం రానుంది, కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూదు. ఈసీ కోడ్ ప్రకారం చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రకటించాలి. అందుకే జూన్ ఒకటో తేదీన సాయంత్రం 6.30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తారు.
సాధారణంగా పోలింగ్ ముందు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ , మూడ్ ఆఫ్ ది నేషన్ వంటి పేర్లతో తమ అంచనాలను పోల్ స్ట్రాటజీ సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తాయి. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సరళని విశ్లేషించి.. ఓట్లేసిన వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు. ఇందులో రిజల్ట్స్ సరళి కనిపిస్తుంది.
ఎగ్జిట్ పోల్స్ ను చాలా సంస్థలు ప్రకటిస్తాయి కానీ.. వాటిలో అత్యంత విశ్వసమైనవి సీట్లను దాదాపుగా అంచనా వేస్తాయి. చాలా సంస్థలు ఫీల్డ్ వర్క్ చేయకుండానే అంచనాలను ప్రకటిస్తూ తప్పుదోవ పట్టించేలా ఫలితాలు వెల్లడిస్తాయి. కానీ విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసి ప్రజానాడిని పట్టుకునే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో సీఓటర్ సంస్థ ఒకటి. ఏబీపీ గ్రూప్ తో కలిసి సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ (ABP CVoter Exit Polls 2024) ను ప్రకటించనుంది. చివరి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటన ఉంటుంది.
ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ కు దేశవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. క్రమం తప్పకుండా ప్రకటించే ఫలితాల్లో చాలా వరకు ఓటర్ నాడిని అంచనావేసిటన్లు ఫలితాలు ఇస్తుంది ఏబీపీ - సీఓటర్. అందుకే ఎగ్జిట్ పోల్స్ పై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తే.. ఫలితాలు కూడా దాదాపు అలాగే వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలకు ఎంతో సమయం ఉండదు. ఈ రెండు రోజుల పాటు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి తుది ఫలితాలు ప్రకటించనుంది ఈసీ.
'దైనిక్ భాస్కర్' సర్వే - దేశంలో ఏ పార్టీది అధికారమంటే?
'దైనిక్ భాస్కర్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 281-350, I.N.D.I.Aకు 145-201, ఇతరులు 33-49 స్థానాలు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది.
లోక్ సభ ఎన్నికలు - ABP C-Voter ఎగ్జిట్ పోల్స్
ABP C-Voter ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీయే కూటమికి 339 - 396 సీట్లు వస్తాయని తేలింది. I.N.D.I.Aకు 122 -167 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
లోక్ సభ ఎన్నికలు - న్యూస్ నేషన్ సర్వే
న్యూస్ నేషన్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 342-378, I.N.D.I.Aకు 153-169, ఇతరులు 21-23 స్థానాలు వస్తాయని అంచనా వేశారు.
జన్ కీ బాత్ సర్వే - దేశంలో ఆ పార్టీదే అధికారం
'జన్ కీ బాత్' ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీయేకు 362-392, I.N.D.I.Aకు 141-161, ఇతరులు 10-20 స్థానాలు కైవసం చేసుకోనుందని తేల్చింది.
రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సర్వే
ఎన్డీయేకు 353 - 368, I.N.D.I.Aకు 118 - 133, ఇతరులు 43 - 48 స్థానాలు కైవసం చేసుకుంటుందని రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ సర్వే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.